శ్రీలంక బాంబు పేలుళ్ళలో 300 పైగా ప్రజలు అసువులు బాసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ విభాగానికి నిన్న రాత్రి పోద్దుపోయాక్ అందిన సమాచారం కలకలం రేపుతోంది. అదేంటంటే అందుతున్న సమాచారం ప్రకారం భారత్ లోని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పుదుచ్చేరి, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ల లో పేలుళ్లు జరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే అందుతున్న సమాచారం ప్రకారం ఈ పేలుళ్లు వెంటవెంటనే జరిగే అవకాసం ఉందని, ముఖ్యంగా ట్రైన్ లలో ఈ పేలుళ్లు జరగనున్నాయని అంటున్నారు. ఇప్పటికే తమిళనాడులోని రామనాధపురంలో 19 మంది టెర్రరిస్ట్ లు ఉన్నారని అంటున్నారు. ఈ నేపద్యంలో ఈ ఎనిమిది రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్.పీ ఠాకూర్ స్పందించారు. శ్రీలంక తరహాలో రాష్ట్రంలో కూడా పేలుళ్లు జరుగుతాయని వచ్చిన సమాచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, తమిళనాడు పోలీసు అధికారులతో ఈ విషయం మాట్లాడి నిర్ధారణ చేసుకున్నామని తెలిపారు. పేలుళ్లు జరుగుతాయని మెసేజ్ పంపిన వ్యక్తి మిలటరీ మాజీ ఉద్యోగిగా గుర్తించామని, మద్యం మత్తులో ఆ మెసేజ్ పంపినట్లు తమకు తెలిసిందని ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఎలక్షన్ కౌంటింగ్‌కు సంబంధించి ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరమవుతారో ఇంకా ఒక అంచనాకు రాలేదని డీజీపీ ఆర్.పీ ఠాకూర్ అన్నారు.
కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో సుమారు 7 వేల మందితో భద్రతా చర్యలు తీసుకున్నామని, కానీ ఈసారి మాత్రం నాలుగు వేల మందితోనే భద్రతా సిబ్బందితోనే భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్‌కు ముందు, తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని, పోలింగ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై గట్టి చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.