ఇటీవల కాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతీ రోజూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ వ్యాఖ్యలన్నీ తమ ప్రభుత్వంపైకే తిరిగి వస్తున్నాయని, తెలివిగా వైసీపీ సర్కారుని ఇరకాటంలో పెట్టేలా ధర్మాన తన తెలివిని ప్రదర్శిస్తున్నారని వైకాపా పెద్దలు గుర్తించారు. అన్న ధర్మాన కృష్ణదాస్‌ని కాదని మరీ మంత్రిని చేస్తే ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రోజూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తోన్న ధర్మానపై సీఎం జగన్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారట. మంత్రివర్గ మార్పులు-చేర్పుల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాంని మంత్రిని చేయనున్నారని సమాచారం. ధర్మాన ప్రసాదరావుని మినిస్టర్‌గా తప్పించి స్పీకర్‌గా చేయాలనుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలోనూ స్పీకర్ పదవికి ధర్మాన ప్రసాదరావు పేరు ప్రతిపాదిస్తే ఆయన వ్యతిరేకించి తీసుకోలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఫలితాలు మూడు రాజధానులకి రిఫరెండం అని ప్రకటించి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యాడు ధర్మాన. స్థానిక ఎమ్మెల్సీ కోటాలో తన అనుచరుడిని దింపి ఏకగ్రీవం చేసుకోకపోవడం, పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా అబ్యర్థి ఓడిపోవడం వంటివన్నీ ధర్మాన మెడకు చుట్టుకున్నాయి. దీంతో మూడేళ్ల తరువాత వచ్చిన మంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటయ్యేలా ఉందని ఆయన అభిమానులు ఆవేదనలో ఉన్నారు.
ధర్మాన నోటిదూలపై జగన్ కన్నెర్ర.. మినిస్టర్ టు స్పీకర్ ?
Advertisements