ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పన్నులు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి చెత్త పన్ను. చెత్తకు కూడా పన్ను వేయటం పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అయితే దీని పైన వైసీపీ నేతలు దబాయిస్తున్నారు. ఈ రోజు వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ మాట్లాడుతూ, వంద రూపాయలు చెత్త పన్ను కోసం వసూలు చేస్తుంటే, దాని పైన వాదనలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ "చెత్త పన్ను దేని కోసం అయ్యా ? ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తుంది కదా, ఇందులో పెద్ద విషయం ఏమి ఉంది ? 12 నెలకు, రూ.1500 నువ్వు వేసే చెత్త అంతా తీసుకెళ్ళి ప్రాసెస్ చేస్తే, దాని కోసం వందల మంది పని చేస్తుంటే, డబ్బులు ఇవ్వరా ? అది కట్టమని గట్టిగా చెప్పండి. సచివాలయ సిబ్బంది గట్టిగా పని చేయండి. లేకపోతే చెత్త తీసుకుని వెళ్ళకండి. వాళ్ళ ఇంటి ముందే పోసేయండి. ప్రభుత్వ పధకాలు అయితే కావాలి, ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వం అంటే ఎలా ? చెత్త పన్ను మాత్రం కట్టాల్సిందే" అంటూ ధర్నాన చెత్త పన్ను పై ఈ వ్యాఖ్యలు చేసారు.
చెత్త పన్ను పై సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాన...
Advertisements