రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెప్పానని, ఆయన తన మాట వినడంలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. తన నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకుంటాని సిఎంకు స్వయంగా చెప్పానని, తనకు రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని అనిపిస్తుందని వివరించానన్నారు. దీనికి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని, ఆ తరువాత ఆలోచిద్దామన్నారని మంత్రి తెలిపారు. వాస్తవంగా ఈ సారి ఎన్నికల్లో తన కొడుకుకి సీటు ఇవ్వాలని, తాను పోటీ నుంచి తప్పుకుంటానని ధర్మాన ప్రతిపాదించారని..అయితే ధర్మాన ప్రసాదరావు తనయుడు పనితీరుపై ఐప్యాక్ నివేదికలు చాలా ఘోరంగా ఉన్నాయని అందుకే ప్రసాదరావునే మళ్లీ పోటీ చేయాలని సీఎం చెప్పారని, పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ అసలు విషయం వెల్లడించకుండా నా తరువాత పనిచేసిన వారందరూ కూడా ఎదగాలని, తరువాత తరానికి నాయకులను తయారు చేసి సమాజానికి అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానంటూ కవరింగ్ ఇచ్చారు మంత్రి అని అంటున్నారు.
నేను మళ్ళీ పోటీ చేయనని ధర్మాన చెప్పటం వెనుక, ఆంతర్యం ఇదా ?
Advertisements