ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు జరీ చేసింది. టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి, పిటీషన్ దాఖలు అయ్యింది. ఆ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మసనం, టిటిడి ఈవో ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, అదే విధంగా రూ.2 వేలు జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కేసు విషయం చూసుకున్నట్టు అయితే, టీటీడీ పరధిలో ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తూ, వాళ్ళు క్రమబద్దీకరణ కోసం గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ పైన సుదీర్ఘమైన విచారణ జరిపిన ధర్మాసనం, ముగ్గురినీ కూడా క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్యోగులు చాలా కాలంగా సర్వీస్ లో ఉండటంతో, వాళ్ళకు పెర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులని దేవాదాయ ఈవో పట్టించుకోక పోవటంతో, వాళ్ళు కోర్టు దిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు దీని పై విచారణ జరిగింది. రెండు తరుపున వాదనలు వినిపించారు.

హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా కూడా, కావాలనే ఆదేశాలు అమలు చేయలేదని, కోర్టు ముందు పిటీషన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీని పైన అటు టిటిడి వాదనలు, పిటీషనర్ తరుపున వాదనలు విన్న న్యాయస్థానం, ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలు అమలు చేయలేదని భావిస్తూ, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించింది హైకోర్టు. అయితే దీని పై టిటిడి ఈవో తమ శిక్షను తీసి వేయాలని, హైకోర్టు ముందు అపీల్ చేసుకునే అవకాసం ఉంది. అపీల్ చేసుకుంటే హైకోర్టు ఏమి చెప్తుందో చూడాలి. దీని పై అపీల్ కు వెళ్తారా , లేక డివిజనల్ బెంచు కు అపీల్ కు వెళ్తారా అనేది చూడాల్సి ఉండి. గతంలో కూడా ఇలాగే అధికారులకు జైలు శిక్ష విధించినా,వారు క్షమాపణ చెప్పి అపీల్ చేయటంతో, గతంలో హైకోర్టు ఆ శిక్షను వెనక్కు తీసుకుంది. మరి ఈ సారి ఏమి అవుతుందో చూడాలి. అయితే ఇలా కోర్టు దిక్కరణ చేయటం అనేది, ఈ ప్రభుత్వంలో అతి సాధారణం అయిపొయింది

Advertisements

Advertisements

Latest Articles

Most Read