ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహారాష్ట్రలోని ధర్మాబాద్ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌పైనా కోర్టులో వాదనలు జరిగాయి. నోటీసులు అందుకున్న వారు ఎందుకు హాజరుకాలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా, ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా న్యాయస్థానం ఆదేశాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు.

dharmbada 21092018 2

చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సుబ్బారావు రీకాల్ పిటీషన్ వేసారు. అయితే కోర్ట్ మాత్రం, ఈ పిటీషన్ కొట్టేసింది. ఈ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన వారు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీనికి చంద్రబాబు తరపు న్యాయవాది స్పందిస్తూ.. కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కోరారు. దీంతో న్యాయస్థానం కేసు విచారణను అక్టోబరు 15కు విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబుతో సహా 16 మంది ఆ రోజు న్యాయస్థానానికి తప్పకుండా హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఇదే కేసులో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, ప్రకాశ్‌గౌడ్‌, రత్నంకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. వారి ముగ్గురికి రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.

dharmbada 21092018 3

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించడంతో టీడీపీనేతలు దీనిపై మరోసాని న్యాయకోవిదులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే టీడీపీ లీగల్ సెల్ నేతలతో పాటు అడ్వొకేట్ జనరల్, ఇతర న్యాయపండితుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రీకాల్ చేయడంతో పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసే చాన్స్ ఉంది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 జూలై 17న చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలు ప్రాజెక్టు వద్ద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. 8 ఏళ్ళ తరువాత, ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబుకి నోటీసులు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read