ధొలెరా సిటీ.. గుజరాత్ లో నిర్మిస్తున్న అతి పెద్ద నగరం.. ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తూ కడుతున్న నగరం... ఈ నగర నిర్మాణం గురించి, పెద్దగా దేశంలో ఎవరికీ తెలియదు... ఎప్పుడైతే అమరావతికి చేస్తున్న అన్యాయం పై, చంద్రబాబు ఎదురుతిరిగి, ధొలెరా సిటీకి నిధులు ఇస్తారు, మాకు ఎందుకు ఇవ్వరు అని అడిగారో, అప్పటి నుంచి దేశంలో చర్చ మొదలైంది. అప్పటి వరకు ఎదో ప్రాజెక్ట్ అనుకున్న దేశ ప్రజలు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని చంద్రబాబు చర్చలో పెట్టేంతవరకు, తెలియదు.. ఇప్పుడే ఈ విషయం పై అన్ని రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.. కేంద్రం నిధులు ఇచ్చి మరీ ఈ నగరం కడుతుంటే, మిగతా రాష్ట్రాలు ఎందుకు ఊరుకుంటాయి ? దీంతో అమిత్ షా రంగంలోకి దిగి, కేంద్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు అంటూ అబద్ధాలు కూడా ప్రచారం చేసారు... గుజరాత్ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది... దేశ వ్యాప్తంగా చర్చ మొదలు కావటంతో, ఒక పేపర్ యాడ్ కూడా ఇచ్చింది.
ప్రభుత్వ ఖర్చుతో పార్టీ పరంగా వివరణ ఇచ్చినట్లు ఉన్న ఆ ప్రకటనల్లో కేంద్రం రూ.3 వేల కోట్లు మాత్రమే ధొలెరాకు ఇస్తుందని.. ఆ ప్రాజెక్ట్ వ్యయం రూ.57 వేల కోట్లు అని ప్రకటనల్లో చెప్పుకొచ్చారు. అమరావతిని ఉపాధి అవకాశాల కేంద్రంగా చంద్రబాబు తీర్చిద్దాలనుకుంటున్నారు. ధొలెరా కాన్సెప్ట్ కూడా అదే. అమరావతి పోటీ వస్తే.. ధొలెరా నష్టపోతుంది అన్న ఉద్దేశంతో కేంద్రం కావాలనే నిరాదరణ చూపిస్తోంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం. అందుకే బయటకు చెప్పకపోయినా.. ప్రత్యేక పద్దతుల ద్వారా ధొలెరాకు వేల కోట్లు వెళ్తున్నాయనేది ఏపీ ప్రభుత్వం అనుమానం. యనల రామకృష్ణుడు కూడా అదే చెబుతున్నారు. ధొలెరాపై చంద్రబాబు విమర్శలు ప్రారంభించిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ప్రచారం ఉద్ధృతం చేస్తోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం అమరావతి- ధొలెరాను పోల్చి ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు.
ఈ ధొలెరా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నిర్మిమతవుతోంది. మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఎకరాల ప్రాజెక్ట్. ఇందులో కోర్ ఏరియా 5,600 ఎకరాలు. రాజధాని అహ్మదాబాద్‌తో అనుసంధానం చేసేందుకు 10 లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2007లో ప్రకటించారు. అది పేపర్లపైనే ఉంది. మోదీ ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో..అప్పుడు ఈ నగారనికి మహర్దశ ప్రారంభమైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ... ధొలెరాకు రూ.2,784 కోట్లు నిధులు ఇచ్చారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలోనూ కేంద్రం చొరవ తీసుకుంది. అన్ని విధాలుగా ధొలెరాకు అండగా నిలుస్తోంది. అహ్మదాబాద్, సూరత్, వడోదరా లాంటి పెద్ద నగరాలు ఉన్నా, ఇప్పుడు ధొలెరా, గిఫ్ట్ సిటీ లాంటి మరో పెద్ద నగరాలు మీరు కట్టుకుంటున్నారు, మరి అమరావతికి ఎందుకు సహాయం చెయ్యరు అని అడిగితే మాత్రం, మీకు మయసభ కావాలా అంటూ, బీజేపీ నేతలు ఎగతాళి చేస్తారు.