తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రపై, అలాగే సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, మరో మాజీ అధికారి గురునాథంల పై ఏసిబి కేసు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జరిగిన భూబదలాయింపుకు, అప్పుడు సంగం డైరీ చైర్మెన్ గా కూడా లేని ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అయితే ఏసిబి కోర్టులో, ఏసిబి వేసిన కస్టడీ పిటీషన్ పై, ఏసిబి కోర్టు స్పందిస్తూ, నాలుగు రోజులు కస్టడీకి ఇచ్చింది. అయితే ధూళిపాళ్ల నరేంద్ర, అసలు ఈ కేసునే క్వాష్ చేయాలి అంటూ, హైకోర్టులో కేసు వేసారు. ఈ కేసు విచారణ హైకోర్టులో ఉండగానే, ఏసిబి ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీలోకి తీసుకుంది. నిన్న మొదటి రోజు విచారణ కూడా జరిగింది. అయితే ఈ కస్టడీ పై, ధూళిపాళ్ల నరేంద్ర న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టు స్పందిస్తూ, వెంటనే ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఇస్తూ, ఏసిబి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేసింది. ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా , సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, మరో మాజీ అధికారి గురునాథంల కస్టడీ ఉత్తర్వులు కూడా హైకోర్టు నిలిపి వేసింది. వారిని విజయవాడ సబ్ జైలు నుంచి, రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.

narendra 02052021 2

ఈ కేసు తదుపరి విచారణను , సోమవారానికి వాయిదా వేస్తూ, హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు బెంచ్, ఈ కేసు విచారణ చేసి, ఏసిబి ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు వారిని రాజామండ్రి తరలించే అవకాసం ఉంది. మరో పక్క నిన్న ఏసిబి అధికారులు మొదటి రోజు విచారణ చేసారు. ఈ సందర్భంగా, ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఏసిబి కార్యాలయానికి తీసుకుని వచ్చారు. రాజమండ్రి జైలు వద్ద, ఏసిబి కార్యాలయం వద్ద, ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను కలవటానికి ప్రయత్నం చేసారు. నరేంద్ర తల్లి ప్రమీలాదేవి, భార్య జ్యోతిర్మయి, కుమార్తె, నరేంద్రను చూసేందుకు వచ్చారు. అయితే వారిని పోలీసులు మాత్రం అనుమతించలేదు. ముఖ్యంగా ఆయన కుమార్తె, కారు వద్దకు వచ్చి, ఒక్కసారి గ్లాసెస్ దించండి, ఆయనతో మాట్లాడాలి అని వేడుకున్నా, పోలీసులు మాత్రం కుదరదు అని చెప్పారు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారిని బాధ కలిగించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read