మమ్మల్ని ఎదురిస్తున్న, చంద్రబాబుని ఎలా అయినా దించాలనే ఆపరేషన్ మొదలు పెట్టింది కేంద్రం. ఈ ఆపరేషన్ లో ప్రధాన పాత్రదరులు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రాన్ని, మోడీ, అమిత్ షా లను ఒక్క మాట కూడా అనకుండా, ఢిల్లీ అహంకారం పై దేశ వ్యాప్త ఉద్యమం చేస్తున్న చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు అందరూ కలిసి పని చేస్తే, ప్రజలు వీరి గుట్టు పట్టేస్తారని, ఇప్పటి వరకు విడివిడిగానే ఉన్నారు. కాని ఎన్నికల్లో జగన్, పవన్ కలిసి పని చెయ్యాలని, ఢిల్లీ ఆదేశాల మేరకు, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పని చేస్తారనే వార్తలు కూడా వచ్చయి. అయితే, జగన్, పవన్ పొత్తు పై, ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.
ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర జరిగిన సమయంలో జగన్మోహనరెడ్డి పవన్‌ను కలిసి 40 సీట్లు ఆఫర్ చేశారు. అయితే సీఎం సీటుపై పవన్‌కల్యాణ్ దృష్టి పెట్టడం వల్ల సీట్లు సర్దుబాటుకాక బయటకు వచ్చినట్టు తెలిసింది. కులం, మతం పునాదులపై వారు అధికారంలోకి రాలేరు.
ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఆడుతూ ఆంధ్ర ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని నమ్మించి దగా చేసింది. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రె్‌సతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దానిని చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని కారెం మండిపడ్డారు.