జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయ్యింది. ఈ మూడేళ్ళలో చెప్పుకోదగిన పని ఏమైనా ఉందా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కానీ చెడగొట్టిన పనుల లిస్టు అయితే చాంతాడు అంత ఉంది. ఆ పని నీకు ఎందుకు చేయటం చేతకాలేదు అంటే, మొత్తం చంద్రబాబే చేసాడు అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఏది అడిగినా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. ఇదే కోవలో పోలవరం కూడా వచ్చి చేరింది. చంద్రబాబు ఉన్న సమయంలో, పోలవరం పనులు పరుగులు పెట్టాయి. కొండలను పిండి చేసి, 72 శాతం పోలవరం పనులు పరిగెత్తించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఆ పనులు కొనసాగించి ఉంటే, పోలవరం మొదలయ్యి రెండేళ్ళు అయ్యేది. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో మొదలు పెట్టి, ఇప్పటి దాకా ఏ పని చేయకుండా, కేవలం 4 శాతం పనులు చేసి, ప్రతి ఏడాది, అదిగో పూర్తి చేస్తున్నా, ఇదిగో పూర్తి చేస్తున్నాం అని, డబ్బా కొట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో, మూడేళ్ళు అయ్యింది ఎందుకు పోలవరం పూర్తి చేయలేదని అడిగితే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జగన్ మోహన్ రెడ్డి టిడిపి పై విరుచుకు పడ్డారు. మొత్తం చంద్రబాబు చేసిన ఘనకార్యమే అని, చంద్రబాబు కట్టిన డయాఫ్రం వాల్ దెబ్బతిందని, అందుకే పోలవరం లేట్ అయ్యిందని అన్నారు.
చంద్రబాబు కట్టిన డయాఫ్రం వాల్ దెబ్బ తినటంతో, దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నామని అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇదే విషయం పై, డిజైన్ల అప్రోవల్ కోసం ఏపి అధికారులు, కేంద్రం వద్దకు వెళ్లారు. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. ఒక పక్క ప్రాజెక్ట్ ఏరియాలో అంత వరద ఉంటే, డయాఫ్రం వాల్ దెబ్బతిందని, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటూ కేంద్రం ఏపి అధికారులను ప్రశ్నించింది. ముందు ప్రాజెక్ట్ ఏరియాలో వరద మొత్తం తోడి, అసలు అక్కడ నిజంగా డయాఫ్రం వాల్ దెబ్బ తిందో లేదో చెప్పాలని, అసలు అక్కడ ఏమి జరిగిందో తెలియకుండా, మీరు ఊహించుకుని ఎలా చెప్తారని, ఈ నెల 15న పూర్తి సమాచారంతో, తమ వద్దకు రావాలని, కేంద్ర జల శక్తి శాఖా మంత్రి చెప్పటంతో, అధికారులు తిరిగి వచ్చారు. అంటే ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వం, చంద్రబాబు వల్లే డయాఫ్రం వాల్ డామేజ్ అయ్యిందని చెప్పి విషయం తప్పు అని తేలింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ లబ్ది కోసం ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్ధం అవుతుంది.