నిన్న ప్రెస్ మీట్ లో ఒకేసారి తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు పై, లోకేష్ పై విమర్శలు చేసి హీట్ పెంచిన గన్నవరం ఎమ్మేల్యే వంశీ, ఈ రోజు మరి కొంత డోస్ పెంచి, టిడిపి పై విరుచుకుపడ్డారు. ఆడు, ఈడు అంటూ, చాలా పరుష పదజాలంతో మాట్లడారు. నిన్న రాత్రి కూడా ఒక టీవీ షోలో, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పై విరుచుకు పడ్డారు. ఇరువురి నేతలూ ఒకరి పై ఒకరు బూతులతో తిట్టుకున్నారు. ఈ రోజు విజయవాడ సీపీకి, తన పై మార్ఫింగ్ చేస్తున్నారు అంటూ కంప్లైంట్ ఇచ్చిన వంశీ, తరువాత మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర విమర్శలు చేసారు. అయితే వంశీ ఇలా విరుచుకు పడటం పై, ఒక వ్యూహం కనిపిస్తుంది. ఇలా పౌరుషంగా మాట్లాడి, పార్టీ నుంచి సస్పండ్ అయ్యేలా చేసుకుంటే, తన ఎమ్మెల్యే పదవి సేఫ్ అని, వంశీ పై అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు అని, అందుకే జగన్ ఆదేశాల ప్రకారం, వంశీ ఈ వ్యూహం పన్నారా అనే అనుమానం కలుగుతుంది. అయితే వంశీ మాత్రం, తనను టిడిపి నేతలు తిడుతున్నారు కాబట్టే, నేను ఇలా తిడుతున్నా అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
అయితే వంశీ ఇలా విరుచుకు పడటం, సాక్షాత్తు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకి కనీస విలువ కూడా ఇవ్వకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండటంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని, వెంటనే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తరువాత జరిగే పరిణామాలు అనవసరం అని, చంద్రబాబుని కూడా విలువ ఇవ్వకుండా, రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీ పై, కనీస కృతజ్ఞత లేకుండా విమర్శలు చేస్తుంటే, చూస్తూ ఊరుకో అవసరం లేదని, అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలని తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, మరో పక్క, తెలుగుదేశం పార్టీ నిర్ణయంతో, చేజేతులా వంశీ పై అనర్హత వేటు వేసే అవకాసం పోయింది అనే వాదన కూడా వినిపిస్తుంది. ఒకసారి పార్టీ నుంచి సస్పండ్ చేస్తే, అనర్హత వేటు వెయ్యమని స్పీకర్ ని కోరే అవకాసం లేదనే వాదన వినిపిస్తుంది. సస్పెండ్ చెయ్యకుండా, తెలుగుదేశం పార్టీ, స్పీకర్ కు అనర్హత వేటు వెయ్యమని ఫిర్యాదు చేసి ఉంటే, వంశీ ఇరుకున పడేవారని అంటున్నారు. ఇప్పుడు వంశీ తటస్థ ఎమ్మేల్యగా కొనసాగటానికి వీలు ఉటుంది అని,వైసిపీకి మద్దతుగా కొనసాగుతారని, అంటున్నారు. తెలుగుదేశం పార్టీనే ఈ అవకాశం ఇచ్చినట్టు అయ్యింది అనే వాదన వినిపిస్తుంది. మరి ఈ విషయం ఎంత వరకు నిజం ? వంశీ అనర్హత వేటు నుంచి బయట పడినట్టేనా ? తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఎలా ఉంది ? చూద్దాం, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.