ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా, ప్రత్యేకహోదా కోసం, మిగతా విభజన హామీలు, ఆంధ్రా అభివృద్ధి కోసం పోరాడుతున్నది తామేనని, జగన్, పవన్ చెప్పుకున్నారు. కానీ అసలైన పోరాటం జరుగుతున్న సమయంలో మాత్రం ఈ ఇద్దరు నాయకులు పోరాటంలో పాల్గనకుండా చేతులు ఎత్తేయటమే కాక, పోరాడేవారిని కూడా బలీహన పరుస్తున్నారు. వీరు మోడీ అనే పేరు పలకతానికే భయపడుతుంటే, అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్లమెంట్‌లో తెగించి పోరాడారు. వారి పోరాటాన్ని చూసిన ఆంధ్రా ప్రజలు ఇటువంటి నేతలే కదా,మనకు కావాల్సింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
టిడిపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు ఎక్కడ, జగన్, పవన్ ఎక్కడ, వాళ్ళిద్దరికీ, వీళ్ళిద్దరికీ నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా ఉంది అంటూ, రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిన ఒక సీనియర్ నేత అన్నారు అంటే, అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు యువనేతల గురించి ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా ఉద్యమంలో ఈ నేతలు, ప్రస్తుతం, గతంలో చేసిన పోరాటాల గురించి వారికి రాష్ట్ర ప్రయోజనాల పై ఉన్న చిత్తశుద్ది గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు వ్యాపారాలున్నాయని...తాను ప్రధానిపై విమర్శలు చేస్తే తనను ఇబ్బంది పెడతారని తెలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 'మిస్టర్ మోడీ' అంటూ లోక్‌సభ సాక్షిగా నిలేశారు.
మరో యువ ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా...మోడీని నిలేశారు. రైల్వేజోన్ ఇస్తామని హామీ ఇచ్చారని, దాన్ని ఎందుకు నెరవేర్చలేదని..ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని మీరు..మోసగాళ్లు అంటూ సభ సాక్షిగా గర్జించారు. మొత్తం మీద..యువ తెలుగుదేశం ఎంపీలు..'మోడీ'కి చెమటలు పట్టిస్తే..తమకు ప్రజల్లో అపారమైన మద్దతు ఉందని చెప్పుకునే 'జగన్,పవన్'లు..'మోడీ' పేరెత్తడానికే..వణికిపోయి దాక్కున్నారు. తాను ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన 'పవన్' చివరకు టిడిపి అవిశ్వాసం పెట్టినప్పుడు..మద్దతు సంగతేమో నీ కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు. ఆయన బిజెపి ఆడించినట్లు ఆడుతున్నారనే విమర్శలను కొని తెచ్చుకున్నారు. ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు యువనేతలు..ఈ విధంగా వ్యవహరిస్తే అధికార పార్టీకి చెందిన యువ ఎంపీలు పార్లమెంట్‌లో తెలుగు పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు.