వైసీపీ ప్ర‌భుత్వం చెప్పే మాట‌కి, చేసే ప‌నికి అస్స‌లు సంబంధం ఉండ‌ద‌ని వారి తీరుతో నిరూపించుకున్నారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తిలో ఇల్లు క‌ట్టుకున్నాడు, రాజ‌ధాని మారుస్తాడ‌ని చేసే ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటూ మొత్తం వైసీపీ నేత‌లు మైకు ముందుకొచ్చి మ‌రీ చెప్పారు. ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌క‌టించారు. కోర్టులు-వివాదాలు చుట్టూ తిరుగుతున్న రాజ‌ధాని వ్య‌వ‌హారంలో విశాఖే రాజ‌ధాని అని సీఎం జ‌గన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ సాగించిన మూడు రాజ‌ధానుల పాట జ‌గ‌న్ నాట‌కంలో భాగ‌మేన‌ని తేలిపోయింద‌ని మూడు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కి అర్థ‌మైపోయింది. ఈ డ్యామేజీని కంట్రోల్ చేయ‌డానికి మాది మూడు రాజ‌ధానుల విధాన‌మేన‌ని, విశాఖ‌లో ఇన్వెస్ట‌ర్ల స‌ద‌స్సు ఉన్న నేప‌థ్యంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు, కొత్త ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌ని ప్రోత్స‌హించేందుకు అలా విశాఖ రాజ‌ధాని అని చెప్పామ‌ని స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందు వివ‌ర‌ణ ఇచ్చారు. అంటే ప్ర‌జ‌ల కోసం మూడు రాజ‌ధానులు, ఇన్వెస్ట‌ర్ల కోసం ఒక రాజ‌ధాని రాగ‌మా అని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్ నేను ఎక్క‌డుంటే అక్క‌డే రాజ‌ధాని అని, విశాఖ‌కి షిఫ్ట్ అవుతున్నాన‌ని ప్ర‌క‌టిస్తుంటే,  మూడు రాజధానులే మా ప్రభుత్వ విధానం అని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెబుతున్నారు. మొత్తానికి టిడిపి నేత‌లు అంటున్న‌ట్టు మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట వైసీపీ ఆడుతున్నట్టే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read