వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు, రాజ్యసభ సాక్షిగా గంగలో కలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ప్రతి దానికి ఎంత హడవిడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ముందుగా బులుగు మీడియాలో హడావిడి చేస్తారు, తరువాత పేటీయం బ్యాచ్ ని పెట్టుకుని సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు, తరువాత వందల కోట్లతో పేపర్ ప్రకటనలు ఇస్తారు, ఇంత హడవిడి చేసిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతారు. బటన్ నోక్కటమో, లేదా ఏదో వీడియో తీసి వదలటమో చేస్తారు. ఇది వైసీపీ మార్క్ చేసే హడావిడి. ఆ పని అవుతుందా లేదా అనేది తరువాత సంగతి. ఈ హడావిడి చూసి నేషనల్ మీడియా కూడా బుట్టలో పడుతుంది. జగన్ మోహన్ రెడ్డి అద్భుతాలు చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా ఊదరగొడతారు. ఇలా అనేక అంశాలు ఉన్నా, అందులో ఒకటి దిశ చట్టం. హైదరాబాద్ లో అ-త్యా-చా-రాని-కి గురైన దిశ పేరుతో, జగన మోహన్ రెడ్డి దిశ చట్టం అని ఒకటి చేసారు. అయితే ఇది పుర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం. 21 రోజుల్లో ఉరి శిక్ష, అదీ ఇదీ అంటూ హడావిడి చేసారు. అసెంబ్లీలో కేసీఆర్ కు హాట్స్ ఆఫ్ కూడా చెప్పారు. ఇప్పటికే ఉన్న నిర్భయా యాక్ట్ లను కూడా పక్కన పడేసి, ఈ దిశ యాక్ట్ తెచ్చారు. దిశ దిశ అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే, ఇది అసలు చట్టమే అవ్వలేదు.

parimal 01122021 2

ఇది కేవలం బిల్లు రూపంలోనే ఇంకా ఉంది. ఈ బిల్లుని కేంద్రం వద్దకు పంపించినా, కేంద్రం ఈ బిల్లుని తిప్పి పంపించింది. ఇందులో అనేక అంశాల పై తమకు సందేహాలు ఉన్నాయని తిప్పి పంపించింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, దిశ చట్టం ఉందని, దిశ చట్టం కింద శిక్షలు కూడా పడ్డాయి అంటూ, ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా శిక్షలు పడలేదు. ఇంకా ఇంకా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టిడిపి ఈ విషయం అనేక సార్లు లేవనెత్తినా, దిశ చట్టం ఉంది అంటూ ఎదురు దా-డి చేసే వారు. ఇప్పుడు వైసీపీ పరువు సొంత పార్టీ ఎంపీనే తీసేశారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ దిశ చట్టం గురించి రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. దానికి కేంద్రం సమాధానం చెప్తూ, దిశ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని, అందుకే ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపిచలేదని తెలిపింది. దిశ బిల్లు పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాం అని , అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ వచ్చే దాకా ఏమి చేయలేం అని చెప్పింది. దీంతో వైసీపీ చెప్తున్నవి అబద్ధాలే అని, వైసీపీ ఎంపీ ప్రశ్నతోనే తేలిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read