తెలంగాణా ఎన్నికల ముందు, తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతి పరులు టార్గెట్ చేసిన ఐటి దాడులు గుర్తున్నాయా ? ఎలాంటి హడావిడి చేసారో అందరూ చూసాం. ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అంటూ హంగామా చేసి, చివరకు రూపాయి కూడా బయట పెట్టలేక పోయారు. ఇవన్నీ అప్పట్లో తెలంగాణా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టటానికి. విచిత్రం ఏమిటి అంటే, తెలంగాణా ఎన్నికలు అయిపోగానే, ఎక్కడికక్కడ ఐటి దాడులు ఆగిపోయాయి. గత మూడు నెలల నుంచి ఎక్కడా ఐటి దాడులు లేవు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఐటి దాడులు మొదలయ్యాయి. ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో ఉన్నాయి అనగా, మళ్ళీ ఈ గోల మొదలైంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు టార్గెట్ గా మళ్ళీ ఐటి దాడులు మొదలయ్యాయి.

divisi 14022019

ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ లేబోరేటరీస్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో ఈ సోదాలు సాగుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు కార్యాలయాల్లో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గచ్చిబౌలిలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు సనత్‌నగర్‌లోని దివీస్‌ పరిశోధన విభాగం కార్యాలయం, నగర శివారులోని చౌటుప్పల్‌, విశాఖపట్నంలోని సంస్థ కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

divisi 14022019

ఉద్యోగులను ఉదయం నుంచి కార్యాలయాల నుంచి బయటకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా బయటి నుంచే కార్యాలయానికి తెప్పించుకోవాలని ఐటీ అధికారులు ఉద్యోగులకు సూచించారు. ఐటీ దాడుల నేపథ్యంలో దివీస్‌ యాజమాన్యం స్పందించింది. తమది స్టాక్‌ మార్కెట్‌ లిస్టెడ్‌ కంపెనీ అని, నిబద్ధతతో పూర్తి పారదర్శకంగా పన్నులు చెల్లించి ఏటా ఐటీ అధికారులకు వివరాలు సమర్పిస్తున్నామని పేర్కొంది. ఆదాయపు పన్నుల చెల్లింపులకు సంబంధించి అధికారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పూర్తి వివరాలు సమర్పిస్తామని సంస్థ అధికారులు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read