కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన డిఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా...? ప్రతిపక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను మాత్రం చంద్రబాబు కిందే పని చేయడానికి మొగ్గు చూపుతున్నారా...? అసలు డిఎల్ పయనం ఎటు...? బలమైన నేతగా పేరున్న ఆయన రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి చంద్రబాబుకి మద్దతు పలికే అవకాశం ఉందని అంటున్నారు తెలుగుదేశం నేతలు... అది ఒకసారి పరిశీలిస్తే....

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు కనుమెరుగైన కాంగ్రెస్ పార్టీలోని బలమైన నేతలు అంతా తెలుగుదేశం పార్టీ , ప్రతిపక్ష వైకాపాలో చేరినా మరికొంత మంది నేతలు మాత్రం అలా స్తబ్దుగా ఉండిపోయారు. వారిలో మాజీ ఆరోగ్య శాఖా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఒకరు... కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గానికి చెందిన డిఎల్ కి తన నియోజకవర్గంలోనే కాక జిల్ల్లాలో కూడా మంచి పేరుంది... అన్ని వర్గాలకు ఆయన దగ్గరగానే ఉంటూ వచ్చారు.

అయితే గత ఎన్నికల నుంచి ఆయన దాదాపు రాజకీయాలకు దూరమయ్యారనే చెప్పవచ్చు.. ఎక్కడా కూడా తన పార్టీ కార్యాకలాపాల్లో కూడా ఆయన పాల్గొన్న దాఖలాలు కూడా లేవు.. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న డిఎల్ మళ్ళి తన రాజకీయ పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధమవుతున్నారు.. అయితే ఏ పార్టీలో చేరతారు అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా లేకపోయినా తెలుగుదేశంలో చేరే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి..

వైకాపాకి చెందిన కీలక నాయకులు డిఎల్ ని సంప్రదించినా ఆయన వారికీ ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తుంది... ఆ సందిగ్దత అలా కొనసాగుతున్న తరుణంలో డిఎల్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరికినట్టు తెలుస్తుంది...మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్ లో జరిగే ఒక వివాహంలో వీరిరువురు కలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు తెలుగుదేశం నేతలు...

ఇంత వరకు బాగానే ఉన్నా మైదుకూరు నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి రేగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది... ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ డిఎల్ ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది... డిఎల్ వచ్చినా అధిష్టానం తనకే సీటు ఇస్తుందనే ధీమాలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది... ఏది ఎలా ఉన్నా డిఎల్ తెలుగుదేశంలోకి వస్తే మాత్రం ప్రతిపక్షానికి జిల్లాలో భారీ దెబ్బె అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read