తమిళ ప్రజల ఆరాధ్యనేత కరుణానిధి మృతితో తమిళనాడు మూగబోయింది. అన్నాదురై సమాధి వద్దే కరుణానిధి సమాధి ఏర్పాటు చేయాలని డీఎంకే శ్రేణుల అభిమతం. దీనిపై ఇప్పటికే కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే నేతలు తమిళనాడు ప్రభుత్వం అనుమతి కోరారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని డీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి సమాధి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ చెబుతున్నారు. మెరీనా బీచ్‌లో సీఆర్‌జడ్‌ నిబంధనల ప్రకారం ఎలాంటి కట్టడాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు.

karunaaa 07082018 2

దీనిపై ఇప్పటికే మద్రాసు హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కరుణానిధి సమాధి కోసం గిండి ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత సమాధి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని, అప్పుడు అడ్డు రాని సీఆర్‌జడ్‌ నిబంధనలు ఇప్పుడే ఎందుకు అడ్డు వస్తున్నాయని డీఎంకే శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో డీఎంకే నేతల సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రేపటికల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

karunaaa 0708201 38

ప్రభుత్వ నిర్ణయంపై కరుణానిధి అభిమానులు మండిపడుతుండగా, కుటుంబ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మెరీనా బీచ్‌లోనే స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డీఎంకే బధవారం ఉదయం హైకోర్టును ఆశ్రయించనుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాల్సిందిగా కోరనుంది. మద్రాస్ హైకోర్టు మంగళవారం రాత్రి 10:30 గంటలకు పిటిషన్ స్వీకరించనుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హులువాడి జి.రమేష్ పిటిషన్‌ను స్వీకరించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read