అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న దాడులు రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని దాడులు చేసిన వైసీపీ, ఈ రోజు సామాన్యుల పై కూడా దాడికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా, నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. సామాన్యుల పై వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పల్నాడు రోడ్డులో ఉన్న శ్రీ కార్తిక్ హాస్పిటల్ పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ దంపతుల పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో వీరి ఆగడాలు ఆగలేదు. కొట్టటమే కాకుండా, హాస్పిటల్ లో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. వైసీపీ నేతలు చేసిన ఈ అరాచకం చూసి, ఈ పరిణామంతో హాస్పిటల్ లో ఉన్న రోగులు, వారితో పాటు ఉన్న బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక, ఎక్కడ వాళ్ళను కూడా చంపెస్తారో అని, అక్కడ ఉన్న రోగులు హాహాకారాలు చేశారు.
అయితే వివరాలు ప్రకారం, మామ ఇవ్వాల్సిన బెట్టింగ్ డబ్బులు కోసం అల్లుడి హాస్పిటల్ పై ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. హాస్పిటల్ నిర్వాహకురాలు, డాక్టర్ రమ్య మాట్లాడుతూ జగన్ పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పోయిన ఎన్నికల్లో ఓటు వేసి జగన్ ని గెలిపించుకున్నామని, ఇలా చేసినందుకు మాకు తగిన బుద్ధి చెప్పారని, ఇలాంటి వాళ్లకు ఓటు వేసినందుకు, ‘మా చెప్పుతో మేం కొట్టుకుంటాం’ అని అన్నారు. కొట్టటమీ కాకుండా, కులంతో తిట్టారని, ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని అంటూ హేలన చేశారని డాక్టర్ రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండతోనే తమ పై, తమ హాస్పిటల్ పై దాడులు చేసారని ఆరోపించారు. ఇక్కడ హాస్పిటల్ ఎలా నడుపుతారో చూస్తానని సిఐ బిలాలూద్దీన్ కూడా బెదిరించారని, పోలీసులే ఇలా చేస్తుంటే, ఇంకా మేము ఎవరికీ చెప్పుకోవాలని డాక్టర్ రమ్య అన్నారు. స్వయానా ఎమ్మెల్యే గన్‌మెన్ సాయంతోనే వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు.