ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నంలోని నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ కేసు పై, హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మాస్కులు అడిగినందుకు ఆయన్ను సస్పెండ్ చెయ్యటం, తరువాత జరిగిన పరిణామాలు, రోడ్డు మీద పడేసి కొట్టటం, పిచ్చోడు అని చెప్పటం, ఇలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసు పై హైకోర్టు సుమోటోగా తీసుకుని, సిబిఐకి ఇచ్చింది. ఈ కేసు పై సిబిఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్, ఆయన బంధువులు, పని చేసిన హాస్పిటల్, ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఇలా అనేక చోట్ల విచారణ చేసింది. ఈ విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఈ కేసు పై నివేదిక హైకోర్టుకు నవంబర్ 11 నే సమర్పించాల్సి ఉంది. అయితే దీని పై ఈ రోజు సిబిఐ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉంది అంటూ, హైకోర్టుకు సంచలన విషయం చెప్పింది సిబిఐ. ఈ కేసు పై ఇంకా లోతుగా దర్యాప్తు చెయ్యాల్సి ఉంది అంటూ, సిబిఐ హైకోర్టుకు తెలిపింది. దీని పై దర్యాప్తుకు మరింత సమయం కావాలని హైకోర్టుకు తెలిపింది. ఈ రోజు డాక్టర్ సుధాకర్ కేసు పై విచారణ సందర్భంగా, సిబిఐ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.

doctor sudhakar 01092020 2

అలాగే ప్రభుత్వం నియమించిన న్యాయవాది, సిబిఐ న్యాయవాది అభిప్రాయాలు కూడా హైకోర్టు అడిగి తెలుసుకుంది. అయితే ఈ కేసులో కుట్ర కోణం ఉందని సిబిఐ చెప్పటం, ఆ కుట్ర కోణం ఏమిటో వెలికి తియ్యాలి అని సిబిఐ చెప్పి, దానికి కొంచెం సమయం అడగటంతో, సిబిఐ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఒప్పుకుంది. ఈ కేసులో సిబిఐ చెప్తున్న కుట్ర కోణం ఏమిటో వెలికి తియ్యాలని హైకోర్టు, సిబిఐ ని ఆదేశిస్తూ మరింత గడువు ఇచ్చింది. అలాగే ఈ కేసులో పూర్వాపరాలు, ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, తదితర వివరాలు అన్నీ, తమకు నవంబర్ 11 వ తేదీ లోపు నివేదించాలని, హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 16 వ తేదీకి వాయిదా వేసింది. సిబిఐ మరింత గడువు అడగటంతో, హైకోర్టు ఈ కేసు పై, మరో రెండు నెలల గడువుని సిబిఐకి అప్పచెప్పింది. అయితే సిబిఐ చెప్పిన కుట్ర కోణం ఏమిటి అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. గతంలోని ఈ కేసు పై అనేక అనుమానాలు ఉన్నాయి. అధికార పార్టీలోని కొంత మంది వ్యక్తులు దీని వెనుక ఉన్నారని, డాక్టర్ సుధాకర్ తల్లి, ఆరోపించిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read