జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిన్న ఉన్నట్టు ఉండి చెన్నైలో ఊడిపడ్డాడు. అంతకు రెండు రోజుల ముందే ఈయన చెన్నైలో జాతీయ రాజకీయాల గురించి మాట్లాడతారు అంటూ, ప్రెస్ నోట్ విడుదల చేసారు. తెలంగాణా ఎన్నికల్లోనే పోటీ చెయ్యలేను అని చేతులు ఎత్తేసిన హీరో గారు, జాతీయ రాజకీయాల గురించి ఏమి మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాలేదు. చెన్నై నుంచి దేశం మొత్తం క్యంపైన్ ఎందుకు చేస్తున్నారో చెప్తారంటూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అయితే, మన మోడీ ఏజెంట్, ఏ పని చేసినా చంద్రబాబుకి నష్టం చేకూర్చే పనే చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చంద్రబాబు దేశ వ్యాప్తంగా మోడీ పై యుద్ధం చేస్తున్నారు. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఆయన నాయకత్వంలో పని చెయ్యటానికి రెడీ అవుతున్నాయి.

modi 22112018 2

ఈ తరుణంలో ఈ నెల 22న ఢిల్లీలో అన్ని పార్టీలతో మీటింగ్ ప్లాన్ చేసారు. అయితే, 5 రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ జాతీయ పార్టీ నేతలు బిజీగా ఉన్న కారణంగా, ఈ భేటీ వాయిదా పడింది. ఈ భేటీ డైవర్ట్ చెయ్యటానికి, మోడీ-అమిత్ షా ఆడిన ఆటలో, అరటిపండు మన పవన్. కాకపొతే, మమతతో మీటింగ్ తరువాత, ఈ మీటింగ్ లేదు అని చంద్రబాబు చెప్పటంతో, అంతా తలకిందులు అయ్యింది. దీంతో చేసేది ఏమి లేక, నిన్న చెన్నై వెళ్లి, అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టటం మొదలు పెట్టాడు. ఈ పోటుగాడు, మార్చ్ 2018 తరువాత ఒక్కసారైనా మోడీ పేరు ఎత్తాడా ? ఏపికి రావలసిన వాటి గురించి ఉద్యమం చేసాడా ? జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి ఏమైంది ? హోదా కోసం ఆమరణ దీక్ష ఏమైంది ? రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ రేట్లు, వ్యవస్థల నాశనం గురించి ఎందుకు మాట్లాడడు ?

modi 22112018 3

ఏపి హక్కుల విషయంలో, కలిసి ఢిల్లీ పై పోరాటం చెయ్యలేని ఈ హీరో గారు, దక్షినాది రాష్ట్రాల హక్కుల కోసం అందరూ కలిసి రావాలని, చెన్నై లో పిలుపు ఇచ్చారు. ఈయనకు ఈ మాట అనే హక్కు ఉందా ? అంతే కాదు తెలంగాణా, ఆంధ్రా విద్వేషాలు రెచ్చగొట్టి, తెలంగాణా ఎన్నికల్లో కేసీఆరు కు లబ్ది చేకూర్చే ఎత్తుగడ కూడా చెన్నైలో వేసాడు. తెలంగాణాలో ఏపి ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటున్నారు అంట.తెలంగాణా వెళ్లి ఆంధ్రాను తిడతాడు. తమిళనాడు వెళ్లి తెలంగాణాను తిడతాడు. ఆంధ్రా వచ్చి తెలంగాణాను చూసి నేర్చుకోవాలి అంటాడు. అసలు ఆంధ్రుడు ద్వితీయ శ్రేణి పౌరుడుగా ఉంది తమిళనాడులో. తమిళనాడులో తెలుగు వారు పడే కష్టాల పై మాట్లాడే దమ్ము లేదు. అలా చేస్తే, తమిళ తంబీలు పరిగెత్తించి హైదరాబాద్ తోలేస్తారు అని భయం. అప్పట్లో కేసీఆర్ చేత థర్డ్ ఫ్రంట్ డ్రామా ఆడించి, భంగపడిన మోడీ-షా, ఇప్పుడు ఈ కొత్త ఏజెంట్ చేత, దక్షినాది డ్రామా ఆడిస్తున్నారు. ఏపి హక్కుల కోసం ఢిల్లీతో పోరాడలేని ఈ హీరో , దక్షినాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడతారు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, నేనే 2019 ముఖ్యమంత్రి అని అక్కడ ప్రకటించుకుని వచ్చారు. అక్కడ విలేకరులు, మనోడి అజ్ఞాన ప్రదర్శనకు ముగ్ధులు అయ్యారు అనుకోండి, అది వేరే విషయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read