ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విచిత్రమైన జీవోని తీసుకుని వచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ జీవో, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందికి పెంపుడు జంతువుగా కుక్కను పెంచుకుంటూ ఉంటారు. అలా కుక్కలను పెంచుకునే వారికి, ఈ జీవో వర్తిస్తుంది. కుక్కలే కాదు, పందులను పెంచుకునే వారికి కూడా ఈ జీవో వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో కుక్కలు, పందులు పెరిగిపోకుండా, వారికి లైసెన్స్ లు ఉండాలని ప్రభుత్వం ఈ జీవోని తీసుకుని వచ్చింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ఈ జీవో ప్రకారం, ప్రతి కుక్కకి, పందులకు లైసెన్స్ ఉండాలి. ప్రభుత్వం చెప్పినట్టు లైసెన్స్ తీసుకోకపోతే ఫైన్ కూడా ఉంటుంది. ఒక వేళ మీరు లైసెన్స్ తీసుకోక పొతే, అధికారులు కనుక పట్టుకుంటే, రూ.500 ఫైన్ కట్టాలి. అంతే కాదు, లైసెన్స్ పొందే వారకు ప్రతి రోజు రూ.250 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ, ఆ కుక్కలతో మాకు సంబంధం లేదు అని కానీ, లైసెన్స్ కానీ తీసుకోకపొతే వాటిని వీధి కుక్కలుగానూ, అలాగే పందులని కూడా అలాగే పరిగణిస్తారు. అలా పట్టుకున్న వాటిని కుటుంబ నియంత్రణ చేస్తారని, ఆ జీవోలో పేర్కొన్నారు. ఒక వేళ, మీ కుక్కకు, పందికి తీసుకున్న లైసెన్స్ కనుక గడువు అయిపోతే, దాన్ని మళ్ళీ రెన్యూ చేయాలి.

pet 29122020 2

మళ్ళీ 10 రోజులులోగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు, లైసెన్స్ పొందాలి అంటూ, ముందుగా వాటి హెల్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. హెల్త్ సర్టిఫికేట్ ఉంటేనే, వాటికి లైసెన్స్ ఇస్తారు. కుక్కలు విషయంలో యజమాని హెల్త్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. అలాగే పందుల విషయంలో ప్రభుత్వం వెటర్నరీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ పొందిన సందర్భంలో కుక్కలకు పందులకు టోకెన్ లు సితారు. ఆ టోకెన్ నెంబర్ లు, కుక్కలు, పందుల మెడలో నిరంతరం వేలాడుతూ ఉండాలి. ఇలా అనేక నిబంధనలతో, ఈ జీవో విడుదల చేసారు. జీవో నెంబర్ 693తో, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఈ జీవోని విడుదల చేసారు. మరి ప్రజలు ఈ జీవో పై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి ఉంది. ఇవన్నీ ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతాయా, ప్రజలు ఫైన్ లు కట్టాలి అంటే ఒప్పుకుంటారా ? ఇందులో ఉండే ఇబ్బందులు ఏమిటో రోజులు గడిచే కొద్దీ అర్ధం అవుతాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read