ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకోవటం, ఒకరి పై ఒకరు విమర్శలు, నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు అంటూ, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం, రాజకీయ నాయకులు అలవాటే. అయితే గతంలో విమర్శించిన వాళ్ళు, నేడు అదే పని చేస్తే ? ఏదో సాదా సీదా విమర్శ కాదు, ఏకంగా అసెంబ్లీలోనే హేళన చేసి, ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు. రాజకీయ నాయకుల పై ప్రజలు చులకన భావం వచ్చేది ఇందుకేగా. ఇక విషయాని వస్తే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, సీజనల్ వ్యాధులు నివారణకు అధికారుల సూచనల మేరకు ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. అదే దోమల పై దండయాత్ర. దోమలు గుమికుడే చోట శుభ్రం చేయటం, దోమల ఉత్పత్తి పెరగకుండా చూడటం, పరిశరాలు శుభ్రంగా ఉంచుకోవటం, మురుగినీటి వ్యవస్థ సరి చేసుకోవటం, ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుని, ప్రజలకు అవగాహన కల్పించే వారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యు వంటి అనేక వ్యాధులు తగ్గుదలకు ఈ చర్యలు ఉపయోగ పడ్డాయి. పక్క రాష్ట్రాలు, నీతి ఆయోగ్ కూడా ఈ చర్యలను అప్పట్లో సమర్ధించాయి. అయితే ఈ అంశాన్ని అప్పటి ప్రతిపక్షం వైసీపీ రాజకీయంగా వాడుకుంది. ఎంతో ముఖమైన ఈ కార్యక్రమాన్ని కామెడీ చేసారు.

doma 31122020 2

దోమల పై దండయాత్ర చేస్తాడు అంట అంటూ, హేళన చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, మంత్రి బుగ్గన అసెంబ్లీలో దోమల పై దండయాత్ర పై ఎంతో హేళనగా మాట్లాడారు. అయితే అదే రోజు ఒక చిన్న పిల్ల డెంగ్యుతో మరణించింది. దానికి మాత్రం, సమాధానం లేదు. అయితే గతంలో హేళన చేసిన కార్యక్రమాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అందుకుంది. కాకపొతే అప్పుడు పెట్టిన పేరు పెట్టలేదు. నిన్న చీఫ్ సెక్రటరీ ఒక జీవో విడుదల చేసారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పరిగణించాలని, సంక్రమిత వ్యాధులను నివారణకు ఈ రోజు ఉపయోగించుకోవాలని తెలిపారు. చుట్టు పక్కల పరిశుభ్రత, దోమలు ఎలా నివారించాలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ జీవోలో తెలిపారు. ముఖ్యంగా మురుగు నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు దోమల వృద్ధికి కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎదుర్కునటానికి ప్రజలతో కలిసి, డ్రై డే చేయాలని, ఆ రోజు పరిసరాలు శుభ్రం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఇది చాలా మంచి విషయం. అయితే గతంలో హేళన చేసిన వాళ్ళు, ఇప్పుడు ఇదే పాటిస్తుంటే, గతంలో చేసింది కరెక్ట్ అని వాళ్ళే చెప్పినట్టు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read