గత నాలుగు రోజులుగా లోక్ సభ, రాజ్య సభ లో కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై టీడీపీ ఎంపీలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.... ఈ సంఘటనలు మొత్తం టీవీ చానెల్స్ లైవ్ టెలీకాస్ట్ ద్వారా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.. మిత్రపక్షం అయిన టిడిపినే ఇలా నిరసన చేస్తే, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది అని అనుకుంటున్న కేంద్రం, తాజాగా షాకింగ్ ఆదేశాలు ఇచ్చింది... ఉభయసభల్లో తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీల ఎంపీలు చేస్తున్న నిరసనలు ప్రసారం చేయొద్దని లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ వర్గాలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
వెల్‌లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్‌లను ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సభ్యులు వెల్ లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దృశ్యాలను టీవీల్లో చూపించవద్దని ఉభయసభల ఉన్నతాధికారులు ఈ రెండు చానళ్ల చీఫ్ లను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి... ఒక పక్క మిత్రపక్షం ఆందోళన చేస్తున్న సంగతి తొక్కి పెట్టటం, మరో పక్క ఎంపీల ఆందోళన చూసి రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థుతులు తలెత్తకుండా, ఈ చర్యలు తీసుకునట్టు తెలుస్తుంది...
నిన్న లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. సభ మొదలవగానే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గోవిందా గోవిందా అంటూ టీడీపీ ఎంపీలు వినూత్నంగా నినాదాలు చేశారు. ఎంపీ శివప్రసాద్ ఏకంగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు.
టేబుల్‌పై ఉన్న పుస్తకాలను తీసుకుని బయటకు వెళ్లేందుకు యత్నించారు.. అలాగే కొంత మంది ఎంపీలు సభలో పడుకుని నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు... ఇవాళ మరింత తీవ్రంగా స్పందన ఉంటుంది అని తెలుసుకున్న కేంద్రం, అవి టీవీల్లో చూపించకుండా నిర్ణయం తీసుకుంది...