కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ అయుదు నెలల్లో, కోర్ట్ ల దగ్గర ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు సెక్యూరిటీ విషయం దగ్గర నుంచి, విద్యుత్ పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్, ఇలా అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. నిన్నటికి నిన్న, రాజధాని అమరావతి విషయంలో, అసలు ఇదేమి వైఖరి, మీ వైఖరి చెప్పండి అంటూ, హైకోర్ట్ మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఈ రోజు హైకోర్ట్ లో, జగన్ ప్రభుత్వానికి డబల్ షాక్ తగిలింది. మొదటిగా ఇసుక విషయంలో, ప్రభుత్వ వైఖరి పై విమర్శలు వస్తున్న వేళ, ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఇసుక కోసం వెళ్లి ఇబ్బందులు పడింది. అమరావతి రాజధాని కోసం, ఎల్‌అండ్‌టీ సంస్థ నిల్వ చేసిన, ఇసుక కోసం ప్రభుత్వం ముందుకు వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్లాయిపాలెం వద్ద రాజధాని నిర్మాణాల కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ నిల్వ చేసిన వేల టన్నుల ఇసుకను ప్రభుత్వం తీసుకుంది.

highcourt 25102019 2

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటంతో, వందల కొద్దీ లారీలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ నిర్ణయం పై, ఎల్‌అండ్‌టీ సంస్థ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇక్కడ ఇసుక డబ్బులు కట్టి తెచ్చుకున్నామని, రాజధాని ఆగిపోవటంతో, ఇసుక ఉందని, డబ్బులు కట్టిన ఇసుకను ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆరోపిస్తూ, హైకోర్ట్ కు వెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇసుక స్వాధీనానికి ప్రభుత్వం జారీచేసిన మెమోలను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెన్స్ లో ఉంచి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే ఇసుక యూనిట్లను లెక్కించాలని కోర్టు తెలిపింది. ఇక మరో కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది.

highcourt 25102019 3

రిజిస్టర్డ్‌ దస్తావేజుల ద్వారా తమకు విక్రయించిన 4,731 ఎకరాల భూమిని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారమై ఈ నెల 19న ఏపీఐఐసీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరింది. "మూడు రిజిస్టర్డ్‌ విక్రయ దస్తావేజుల ద్వారా 4,731 ఎకరాల భూముల్ని ఏపీఐఐసీ రూ.65.07 కోట్లకు మాకు విక్రయించింది. పదేళ్ల కిందట జరిగిన విక్రయమది. ఆ భూములపై హక్కులు మాకు దఖలు పడ్డాయి. చట్టవిరుద్ధంగా వాటిని ఇప్పుడు రద్దు చేసి ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు" అని హైకోర్ట్ కు తెలిపింది. ఈ పిటీషన్ పై స్పందించిన హైకోర్ట్, తదుపరి విచారణ వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని చెప్తూ, తదుపరి విచారణను నవంబర్ 29 వరకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read