ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను మార్చేస్తున్నాం, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచమే తమ వైపు చూస్తుంది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన డబ్బా అంతా తప్పు అని తేలిపోయింది. నాడు-నేడు, ఫీజు రీయింబర్స్-మెంట్, విద్యా దీవెన, చిక్కీ, ఇంగ్లీష్ మీడియం అంటూ ఊదరగొట్టారు. అయితే సరిగ్గా ఇక్కడే, అసలు బండారం బయట పడింది. ఈ రోజు పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఆ ఫలితాలు చూసి షాక్ అయ్యారు ఏపి ప్రజలు. గత 15 ఏళ్ళుగా 90 శాతం పైగా ఉత్తీర్ణత వచ్చింది. చంద్రబాబు హాయంలో కూడా 4.48 శాతం ఉత్తీర్ణత ఉండేది.. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో  67.26 శాతానికి పడిపోయింది. 6.22 లక్షల మంది పరీక్షలు రాస్తే, 4,14,281 లక్షల మంది మాత్రమే  ఉత్తీర్ణత సాధించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన మొదటి రెండేళ్ళు కరోనాతో, అందరినీ పాస్ చేసారు. ఇప్పుడు పరీక్షలు పెడితే పరిస్థితి ఇది. నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో, నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. ఆ దిగజారిన ర్యాంకింగ్స్ చూస్తేనే, ఇప్పుడు ఏపి పరిస్థితి ఇలా ఎందుకు అయ్యిందో అర్ధం అవుతుంది. ఇప్పటికైనా అనవసర ఆర్భాటాలు కాకుండా, ప్రభుత్వం ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని, విశ్లేషణ చేసి, తప్పు సరిదిద్దుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read