నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసునకు సంబంధించి శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ సుధాకర్ మానసిక ఆసుపత్రి సూవరింటెండెంట్‌కు తెలియపరచి ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే సీబీఐ విచారణకు మాత్రం సహకరించాలని సూచించింది. విశాఖ మానిసిక ఆసుపత్రిలో ఆక్రమ నిర్బంధంలో ఉన్న డాక్టర్ సుధాకర్ ను తక్షణమే విడుదల అయ్యేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం సుధాకర్ తల్లి కావేరీ లక్ష్మీభాయి హైకోర్టులో కార్పస్ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన విధితమే. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని సుధాకర్ తల్లి తన పిటీషన్లో పేర్కొన్నారు. ఇరువాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం డాక్టర్ సుధాకర్ డిశ్చార్జికి సమ్మతించింది.

ఆసుపత్రి సూపరింటిండెంట్ కు సమాచారం అందించి సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని స్పష్టం చేసింది. అయితే సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకరకు న్యాయస్థానం సూచించింది. దీనిపై సుధాకర్ తల్లి కావేరి లక్ష్మీబాయి మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉంది. తమకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. సుధాకరను డిశ్చార్జి చేసి మరో ఆస్పత్రిలో చేర్పిస్తాం. తన కొడుకున్న జరిగిన అన్యాయం ఒక్కొక్కటి బహిర్గతం అవుతోంది. సీబీఐ తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. మరోసారి అవకాశం ఇస్తే సీబీఐకి మరిన్ని విషయాలు చెబుతానని ఆమె చెప్పారు. అయితే హాస్పిటల్ నుంచి బయటకు రాగానే సుధాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొన్నాళ్ళు పాటు, ఎవరికీ కనపడకుండా, అజ్ఞాతంలోకి డాక్టర్‌ సుధాకర్‌ వెళ్ళిపోయారు. విశాఖపట్నంలోనే ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. తనకు మానసిక ప్రశాంతత కావాలని, ఒక అయుదు రోజులు తనను ప్రశాంతంగా వదిలెయ్యాలని సన్నిహితులకు చెపినట్టు తెలుస్తుంది. మరో పక్క తాను ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని, సిబిఐకి కూడా విషయం చెప్పారు. డాక్టర్ సుధాకర్ కేసునకు సంబంధించి సీబీఐ విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. నర్సీపట్నం చేరుకున్న సీబీఐ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణవేణిని శుక్రవారం విచారించారు. తొలుత నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి సర్వీసు రికార్డులు, హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణవేణిని విచారించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read