ఆయన అడిగిన తప్పు, కరోనా టైంలో మాస్కులు ఇవ్వటం లేదు అని ప్రభుత్వాన్ని అడగటం. అంతే ఆయన్ను ప్రభుత్వం, సస్పెండ్ చేసింది. విశాఖలోని నర్సీపట్నంలోని హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్. కరోనా సమయంలో డాక్టర్లకు మాస్కులు ఇవ్వటం లేదని, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన్ను సస్పెండ్ చేసారు. బహిరంగంగా వచ్చి, ప్రభుత్వం మాస్కులు ఇవ్వటం లేదు అని అడిగినందుకు, ఆయన్ను సస్పెండ్ చేసారు. అంతే కాదు, తమ అనుకూల మీడియాలో ఆయన్ను, హేళన చేస్తూ కధనాలు ప్రసారం చేసారు. అయితే ఏమైందో ఏమో కాని, ఈ రోజు ఆ డాక్టర్ గారి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నిన్నటి దాకా వైద్యం అందించిన వ్యక్తి నడి వీధుల్లో పడి ఉండడం పై విశాఖ వాసుల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఎలా జరిగిందో ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో కనిపించిన డా.సుధాకర్ ను చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటి దాక వైద్య సేవలు అందించిన డాక్టర్, ఈ రోజు ఇలా ఉండటం పై, అందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ వీధుల్లో డా.సుధాకర్ ను తాళ్లతో కట్టేసి పోలీసులు అటోలో ఎత్తుకెళ్ళటం కనిపిచింది. తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు డా.సుధాకర్ ను పోలీసులు తరలించారు. ఏపీ ప్రభుత్వంపై కరోనా విషయంలో ఇటీవల ఆరోపణలు చేసిన డా.సుధాకర్ ఇలా ఉండటం పై, ఆస్పత్రిలో మాస్కులు లేవని డాక్టర్లకు సదుపాయాలు లేవని డా.సుధాకర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు డా.సుధాకర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే, ఈ రోజు విశాఖ వీధుల్లో ఇలా డాక్టర్ పడి ఉండటం పై, పోలీసులను అడగగా, తాము ఏమి చెప్పలేమని అన్నారు. విశాఖ వీధుల్లో అకస్మాత్తుగా అర్దనగ్నంగా కనిపించిన డాక్టర్ సుధాకర్ ను చూసి నగర వాసులు బాధ పడుతున్నారు.

అయితే ఒక డాక్టర్ కు ఇలాంటి పరిస్థితి ఉండటం పై, విపక్షాలు మండి పడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ, తెలియటానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ఒక దళితుడుకి, అదీ ఒక డాక్టర్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సత్కారం ఇదా అని, వర్ల రామయ్య ప్రశ్నించారు. చాలా హృదయవిదారికంగా ఉన్న పరిస్థితి చూసి, ఒక మేధావిని, ఒక డాక్టర్ ని, అలా రోడ్డు మీద పడేసి, చొక్కా లేకుండా, ఇలా పోలీసులు ట్రీట్ చెయ్యటం పై వర్ల రామయ్య తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. రాష్ట్రం అంతా పులివెందుల పంచాయతీ విస్తరింప చేసారని, తనకు అడ్డు వస్తే సస్పెండ్ చెయ్యటమే కాదు, ఏమైనా చేస్తాను అని ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పటానికి, ఇలా చేసారని టిడిపి ఆగహ్రం వ్యక్తం చేస్తుంది. జగన్ సర్కార్ లో దళితులకు రక్షణ లేదు, డాక్టర్ సుధాకర్ పరిస్థితిపై మానవ హక్కుల సంఘాలు స్పందించాలి అని బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read