విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయంగల ఏకైక సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ)లో ప్రగతి పరుగులు తీస్తోంది. గతంలో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన లాభాలు ఈ ఏడాది రెట్టింపుకుపైగా పెరగడం విశేషం. దేశంలోని పోర్టులు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్‌ పనుల ఆర్డర్లను సాధిస్తూ శరవేగంగా డిసిఐ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.. ఉద్యోగుల సమష్టి కృషి, పనుల ప్రగతి సాధన దిశగా అంకితభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2018లో డిసిఐ ఆర్జించిన లాభం 16.64 కోట్లు. 2017లో కేవలం రూ.7.12 కోట్లే ఆర్జించింది. ఉద్యోగులు అత్యంత శ్రద్ధాసక్తులతో ఈ కృషిని సాధించారన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది.

dredging 11062018 2

హాల్దియా (కోల్‌కతా) షిప్‌యార్డు పనులను, కొచ్చిన్‌ (కేరళ) నేవీ, షిప్‌యార్డు, పోర్టు పనులను, పరదీప్‌ (ఒడిశా) షిప్‌యార్డు పనులనూ ముమ్మ రంగా చేస్తోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ (విపిటి) కూడా రూ.కోట్లతో బీచ్‌ నౌరిషింగ్‌ పనులు తాజాగా అప్పగించింది. విశాఖలోని గంగవరం పోర్టు పనులు, ముంబయి పనులను చేపట్టేందుకు సిద్ధ మవుతోంది. కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ నిర్వహణ (డ్రెడ్జింగ్‌) పనులు రూ.1119కోట్లు, కొచిన్‌ పోర్టు ట్రస్ట్‌ ప్రాజెక్టు ఛానెళ్ల నిర్వహణ పనులు రూ.88.51 కోట్లు 2018లో మంజూరయ్యాయి. పరదీప్‌ పోర్టుకు చెందిన పనులను 2017-18లో ఏడాదిపాటు రూ.67.15కోట్లతో చేపట్టింది. కొచ్చిన్‌ షిప్‌యార్డు ఐదేళ్ల ప్రాజెక్టులో భాగంగా 2015-16లోనే రూ.110కోట్లతో షిప్‌యార్డు మెయిన్‌టెనెన్స్‌ పనులను డిసిఐకి అప్పగించింది. మోంగ్లా పోర్టు (బంగ్లాదేశ్‌) పనులు జరుగు తున్నాయి.

dredging 11062018 3

ప్రభుత్వ రంగంలో లాభాలను ఆర్జించే 'మినీ రత్న' కేటగిరికి చెందిన డిసిఐను కేంద్రంలోని నరేంద్రమోడీ మంత్రి మండలి 2017 నవంబరు ఒకటిన 73.47 శాతాన్ని వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయిలో ఉద్యమాలను చేపట్టడం, పనుల ప్రగతి ని కూడా ఏకకాలంలో ముందుకు తీసు కెళ్తూ లాభాల బాటలోకి నెట్టిన ఘనత ఉద్యోగులదనే చెప్పాలి. విశాఖ కేంద్రంగా గతేడాది నవంబరు 28 నుంచి 40 రోజులపాటు ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనలు, ధర్నాలు ఆందోళనలను చేపట్టారు. కంపెనీ ప్రగతిని చూసి కేంద్రం వ్యూహాత్మక సేల్‌ని నిలిపివేయాలంటూ ఉద్యమాలను నిర్వహించారు.. డిసిఐకి ఆర్థికంగా నష్టం చేసే ఆర్డర్లను ప్రభుత్వాలు చేసినా సరే 'ప్రాఫిట్‌ మేకింగ్‌ కేటగిరీ -1 మినీ రత్నగా డిసిఐ ప్రభుత్వ రంగంలో 1976 నుంచి వెలుగొందుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read