క-రో-నా వ్యాక్సిన్లకు సంబంధించి, ప్రభుత్వం 13 లక్షల రికార్డు అంటూ చేస్తున్న హంగామా పై టిడిపి స్పందించింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ వెబ్ సైట్ వివరాలు చూస్తే, ఏ ఏరాష్ట్రాలు ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చాయో అర్థమవుతుంది. మహారాష్ట్రలో 2కోట్ల76లక్షల పైచిలుకు వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వగా, ఉత్తరప్రదేశ్ లో 2కోట్ల56 లక్షలు, రాజస్థాన్ లో 2కోట్ల12లక్షలు, గుజరాత్ లో 2కోట్ల21 లక్షల వ్యాక్సినేషన్ డోసులఇ వ్వడం జరిగింది. అలానే పశ్చిమ బెంగాల్లో కోటి90లక్షలు, కర్ణాటకలో కోటి84లక్షలు, మధ్యప్రదేశ్ లో కోటి50లక్షల వరకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఏదో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్లుచెబుతున్న రికార్డుస్థాయి వ్యాక్సిన్లు కలిపినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు వేసింది కేవలం కోటి39 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎంత వెనకబడి ఉందో అర్థమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ ఫేర్ వారిగణాంకాలే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి ఒకే రోజులో వ్యాక్సిన్లు వేసిగొప్పలు చెప్పుకుంటున్నా రు. మిగతా రాష్ట్రాలతో పోల్చిచూసి, వారెక్కడున్నారో ఎన్ని వ్యాక్సిన్లు వేశారో గ్రహిస్తే మంచిది. ఈప్రభుత్వమే ఒకమోసకారి ప్రభుత్వం. ముఖ్యమంత్రే పెద్ద మాయలఫకీర్ లా తయారయ్యాడు. అన్నీ మాయ మాటలే. 13లక్షలవ్యాక్సిన్ డోసులు ఒకే రోజులో వేసినట్లు తెగగొప్పలు చెప్పుకుంటన్నారు. 20వతేదీకి ముందు 5 రోజులపాటు ఎన్నివ్యాక్సిన్లు వేశారో, అదికూడా చెప్పమనండి. ఈ నెల 15వ తేదీన 83వేల వ్యాక్సిన్లు వేశారు. 16వతేదీన 31,600 ... 17న 22,300, 18వతేదీన 22,700, 19న సుమారుగా 28వేల వ్యాక్సిన్లు వేశారు. 5రోజులపాటు దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసి, తూతూమంత్రంగా అతితక్కువగా వ్యాక్సిన్లు వేశారు. ఈ ప్రభుత్వం నిర్వహించిన వరల్డ్ రికార్డు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఐదురోజుల ముందువేసిన వ్యాక్సిన్ డోసులు ఎన్నిఉన్నాయో చూశారుగా? 5రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపేసి, ఏదో తూతూ మంత్రంగా వేసి, తరువాత ఒకేరోజు వాటన్నింటినీ భర్తీ చేసేలా వ్యాక్సిన్లు వేయించి ఏదో రికార్డులు సాధించినట్లు చెప్పుకుంటారా సిగ్గులేకుండా? ముఖ్యమంత్రి డ్రామాలు ఎవరికి తెలియవను కుంటున్నారు? ఈరోజు మేం చెప్పిన లెక్కలు తప్పనిచెప్పగల ధైర్యం మీకు, మీప్రభుత్వానికి ఉందా?"
"రోజులతరబడి వ్యాక్సిన్లు ఇవ్వడం ఆపేసి, రికార్డు కోసమని ఒకేరోజున నిబంధనలకు విరుద్ధంగా జనాలను గుంపులుచేసి, 20వతేదీన వ్యాక్సిన్ల పంపిణీలో రికార్డు సాధించామని చెప్పుకుంటారా సిగ్గులేకుండా? రద్దీ లేకుండా భౌతికదూరం పాటించేలా ప్రజలను ఉంచి వ్యాక్సిన్లు ఇవ్వాలి. కానీ 20వతేదీన మీరేంచేశారు? ఒక్కసారిగా కొన్నివేల మందిని వ్యాక్సిన్ కేంద్రాలకు తరలించి, భౌతికదూరం పాటించకుండా, రికార్డుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? మీరిచ్చేవ్యాక్సిన్ల కోసం ప్రజలు చనిపోవాలా? ముఖ్యమంత్రి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్రం ఇప్పటికీ బాగా వెనుకబడే ఉంది. నేటికీ ఇంకా రాష్ట్రంలో 74.15శాతంప్రజల కు ఒక్కడోసు కూడా వ్యాక్సిన్లు అందలేదు. 84లక్షల60వేల మంది రెండో డోసు కోసం కళ్లుకాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. గత ఏడురోజుల్లో (12వతేదీ నుంచి 19వతేదీవరకు) ఏపీ వ్యాక్సినేషన్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 5.27శాతంమాత్రమే. దేశస్థాయిలో ఇది చాలా తక్కువ. 12వ తేదీనుంచి 19వతేదీ వరకుచూస్తే, మొత్తంగా ప్రభుత్వమిచ్చిన వ్యాక్సిన్లు 6లక్షలు. దానిలో 15 నుంచి 19వతేదీవరకు చూస్తే సుమారుగా లక్షా80వేలుమాత్రమే ఇచ్చారు. మిగతా రాష్ట్రాలేమో 3లక్షలు, 4లక్షలు, 5లక్షల వ్యాక్సిన్లు ఇస్తుంటే, మనరాష్ట్రం మాత్రం 20వేలు, 22వేలు, 28వేలకు పరిమితమైంది. మిగిలినరోజుల్లో తగ్గించిన వ్యాక్సిన్లన్నింటినీ ఒకేరోజు ఇవ్వడంకోసం గుంపులు, గుంపులుగా ప్రజలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించారు. తానేదో నంబర్-1 అనిచెప్పుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, గిమ్మిక్కులు, స్టంట్లు వేయవద్దని ముఖ్యమంత్రికి చెబుతున్నాం."