నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా.. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటూ ఎదురుచూసిన అభ్య‌ర్థుల‌కు ఎట్టకేలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా డీఎస్సీ కోసం వేచి చూస్తున్న అభ్యర్థుల కల సాకారం చేసుకునే సమయం రానే వచ్చింది. ఎన్నికల ప్రచారంలో టీచర్ పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగా కార్యాచరణ ప్రకటించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ రోజు డీఎస్సీ ప్ర‌క‌ట‌న‌ చేశారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

dsc 06122017 2

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. మార్చి 23,24,26 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. హాల్‌ టిక్కెట్లును వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు

dsc 06122017 3

ముఖ్యమైన తేదీలివే.. * డీఎస్సీ నోటిఫికేషన్‌ - డిసెంబర్‌ 15న * దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు (ఆన్‌లైన్‌లో) * హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9 * రాత పరీక్షలు : మార్చి 23,24,26 * రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్‌ 9న * కీపై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు * తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 30 * మెరిట్‌ లిస్ట్‌ ప్రకటన : మే 5 * ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం: మే 11న * ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19 వరకు

Advertisements

Advertisements

Latest Articles

Most Read