‘పసుపు-కుంకుమ’ సొమ్ము మహిళల చేతికి చేరింది. సోమవారంతో మూడు రోజుల సంక్షేమ పండగ ఉత్సాహపూరిత వాతావరణంలో పూర్తి కాగా, తొలి విడత చెక్కులను డ్రా చేసుకొనే ప్రక్రియ ఆ వెంటనే మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల డ్వాక్రా సంఘాలు తమకిచ్చిన చెక్‌లను డ్రా చేసుకున్నాయి. తొలివిడతలో ఒక్కో సభ్యురాలికి రూ.2,500చొప్పున ఆ సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందికీ చెక్‌లు మారాయి. ఇప్పటికి 66,574 డ్వాక్రా సంఘాలు, అంటే సుమారుగా 6,65,740 మంది డ్వాక్రా మహిళల చేతికి సొమ్ము చేరింది. సంక్షేమ పండగలో భాగంగా ఈ మూడు రోజుల్లో ‘పసుపు-కుంకుమ’ కింద 94లక్షల మందికి, పింఛన్‌ పెంపు సొమ్ము లబ్ధిని 54లక్షల మందికి అందించారు. ఈ రెండు పథకాల్లోనూ లబ్ధి పొందినవారు 15.51 లక్షల మంది ఉన్నారు.

dwacra 05022019

అంటే, వీరందరికీ డబుల్‌ ధమాకా అందిందన్నమాట! ప్రభుత్వం ద్వారా ‘పసుపు-కుంకుమ’ అందుకున్నవారంతా తమకు అందించిన చెక్‌ల ద్వారా తొలుత తమ పొదుపు ఖాతాల్లోకి సొమ్మును తీసుకుని, అక్కడినుంచి వ్యక్తిగతంగా డ్రా చేసుకున్నారు. మొదటి విడత చెక్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ వేసి ఇచ్చారు. మొత్తం సుమారు 92లక్షల మంది మహిళలకు ఇచ్చిన తొలి విడత మొత్తానికి సరిపడా సొమ్మును ఆయా బ్యాంకు ఖాతాలకు అదే తేదీనాటికి ప్రభుత్వం జమ చేసేసింది. చెక్‌లు ఇచ్చిన అనంతరం ఆదివారం కావడంతో సోమవారం చెక్‌ల ద్వారా డబ్బు తీసుకోవడం పెద్దఎత్తున ప్రారంభమైంది. అదేవిధంగా మార్చి 8వ తేదీతో రెండోవిడతగా రూ.3,500, ఏప్రిల్‌ ఐదో తేదీ వేసి మూడో విడతగా రూ.4వేలు చొప్పున ఆయా సంఘాలకు చెక్‌లు ఇచ్చింది.

 

dwacra 05022019

వీటిని కూడా ఆయా తేదీలనాటికి మారేలా బ్యాంకుల్లో సొమ్ము జమచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాగా, కొత్తగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసుకున్నవారు, కొత్తగా ఆ సంఘాల్లోకి చేరినవారికి కూడా పసుపు-కుంకుమ చెక్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది. జనవరి 18 వరకు డ్వాక్రా సంఘాల్లో చేరినవారందరికీ ఈ లబ్ధిని వర్తింపచేయాలని నిర్ణయించారు. కొత్తగా చేరిన సంఘాలు 33,322 ఉన్నాయి. ఇందులో 2.95 లక్షల మంది మహిళలు సభ్యురాళ్లుగా ఉన్నారు. ఈ సంఘాలన్నింటికీ తొలి విడత పసుపు-కుంకుమ మొత్తాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 8న మండల సమాఖ్యల సమావేశంలో ఈ చెక్‌లను అందిస్తామని సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read