గత చంద్రబాబు హయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజినెస్ సర్కిల్స్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం మొదటి సారిగా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రకటించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో స్థానం వచ్చింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎలాగైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, విభజన జరిగిన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని, మిగతా రాష్ట్రాలతో దీటుగా ముందుకు వెళ్ళగలం అని అనేక సంస్కరణలు తెచ్చారు. కేవలం 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చంద్రబాబు పాలసీని మార్చారు. ఇలా అనేక సంస్కరణలు తీచ్చారు. దీంతో ర్యాంకులు ప్రకటించిన మొదటి ఏడాది రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తరువాత ఏడాది నుంచి దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. వరుసగా 3 సంవత్సరాలు పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక మణిహారంలా నిలిచింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచింది అంటూ, రాష్ట్రం కోసం పెట్టుబడులు తెచ్చారు. దేశంలోనే అతి పెద్ద ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా కంపెనీని తీసుకోవచ్చారు.
అలాగే ఒంగోలులో పేపర్ మిల్ తెచ్చారు. ఇక అనేక దేశీయ కంపెనీలు కూడా చంద్రబాబు గారి హయంలో వచ్చాయి. ఏషియన్ పెయింట్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, ఇసుజు, గమేశా, జియో, అదనీ డేటా సెంటర్, ఇలా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని కంపెనీలు వచ్చాయి అంటే, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం మొదట రావటం ఒక కారణం. అయితే ఇప్పుడు తాజాగా, 2019 జూన్ వరకు తీసిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలోనే ఈ ర్యాంకింగ్స్ ప్రకటించాల్సి ఉన్నా, ఈ సారి లేట్ అయ్యింది. అయితే తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో కూడా ఏపి నెంబర్ వన్ గా నిలిచింది. 2015లో రెండో స్థానంలో వచ్చిన ఏపి, 2016, 17, 18లో కూడా మొదటి స్థానం రాగా, తాజాగా చంద్రబాబు పని చేసిన చివరి ఏడాది కాలానికి కూడా మొదటి ర్యాంక్ వచ్చింది. ఈ విషయం నారా లోకేష్ కూడా ట్వీట్ చేసారు. ఇక వచ్చే ఏడాది జగన్ గారు, ఇదే ఒరవడి కొనసాగిస్తారని ఆశిద్దాం...