రాష్ట్రంలోని పల్లెపల్లెకూ ఎల్ఈడీ వెలుగులు రాబోతున్నాయి. ఇందుకు ఉద్దేశించిన చంద్రకాంతి పథకాన్ని రాష్ట్ర ప్రజలకు నేడు సీఎం చంద్రబాబు అంకితం చేసారు. ఈ కార్యక్రమం కోసం ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడి వెళ్లారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో చంద్రకాంతి కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఎల్ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను ప్రకటించారు. పంచాయతీల్లో ఎల్ఈడీ వెలుగులు నింపడం ద్వారా గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాసిరకమైన వీధి దీపాల వల్ల ఒకవైపు పంచాయతీ నిధులు వ్యయం, మరోవైపు అధిక విద్యుత్ వినియోగమవుతోంది. దీంతో గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎ్‌సఎల్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రకాంతి పేరుతో వీధిలైట్లు స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పట్టణాల్లో 6.2 లక్షల ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చి 133 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేశారు. గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ప్రాజెక్టు పూర్తి చేసి దేశంలోనే గ్రామీణ ఎల్ఈడీలో ముందుండాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్ ప్రతివారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. 12,918 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ దీపాలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే ఎల్ఈడీ లైట్లును అమర్చి తూర్పుగోదావరి జిల్లాను దేశంలోనే నంబరు వన్‌గా నిలిపినందుకు సీఎం అధికారులను ప్రశంసించారు.
జూన్ కల్లా 15 లక్షల ఎల్ఈడీ వీధిదీపాలను అమర్చాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొన్నారు. అక్టోబరు నాటికి మిగిలిన లైట్లన్నీ అమర్చుతారు. పంచాయతీలు రానున్న పదేళ్ల వరకూ ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే విద్యుత్ చార్జీల ఆదాతో ఈ ప్రాజెక్టును నిర్వహించేలా చర్యలు తీసుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీల్లో ఈఈఎ్‌సఎల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 3 లక్షల ఎల్ఈడీ వీఽఽధి దీపాలు అమర్చారని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలో మరెక్కడా ఇంత భారీస్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. వీటివల్ల ఏటా 333 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాతో పంచాయతీలకు రూ.500 కోట్ల మేర లబ్ది చేకూరుతుందని అంచనా. ఈ దీపాలన్నీ ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. వేసవి ఉదయం 5.30కి ఆరిపోయి.. సాయంత్రం 6.30కి వెలుగుతాయి. సీజన్ మారాక టైమ్‌ను మరోసారి సెట్ చేస్తారు.