రెండు నెలల నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం... కేంద్రం చేస్తున్న అన్యాయం పై అందరూ రోడ్డుఎక్కారు... ఎంతో సహనంగా ఉండే చంద్రబాబు కూడా, బీజేపీతో తెగదెంపులు చేసుకుని, కేంద్ర మంత్రి పదవులని కూడా వదులుకున్నారు... ప్రజలు ఎంత ఆందోళన చేస్తున్నా, కేంద్రం మాత్రం పట్టించుకోవటం లేదు... పైగా, మీకు అన్నీ ఇచ్చేసాం అంటుంది... హోదా ఇవ్వమంటే, కుదరదు అన్నారు... కాని ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు... మా ఇష్టం అంటూ, ఆందోళన చేస్తున్న, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని రెచ్చగొడుతున్నారు.... నెల రోజుల క్రితం, ‘హోదా’ జాబితాలోనే ఉన్న సిక్కింతోపాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు మరో 3వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే...
ఈ నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు పన్నురాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు ఈశాన్య రాష్ట్రాలపై కేంద్రం వరాలు గుప్పిస్తోంది. ఇవీ రాయితీలు... ఆదాయ పన్ను: పరిశ్రమ స్థాపించిన మొదటి ఐదేళ్లూ ఆయా పరిశ్రమలు చెల్లించిన పన్నుల్లో కేంద్రం వాటాను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. వస్తు రవాణా: పరిశ్రమల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన వస్తువులను రైల్వే, నిర్దేశిత జల రవాణా, వాయుమార్గ సంస్థల్లో రవాణా చేసే ఖర్చులపై ఐదేళ్లపాటు రాయితీలు అందిస్తారు. జీఎస్‌టీ: వస్తు సేవల పన్నుపై రాయితీని మొదటి ఐదేళ్ల వరకు తిరిగి చెలిం్లచనున్నారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఈ చెల్లింపులు చేస్తారు. బీమా: భవనం, కార్మాగారం, యంత్రాలపై కట్టిన బీమా ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు తిరిగి చెల్లిస్తుంది. ఉపాధి: ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్ మొత్తంలో యజమాని తరఫున 3.67 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రోత్సాహకాల పరిమితి: పథకం అమలు కాలంలో ఒక్కో యూనిట్‌కు వివిధ రూపాల్లో ఇచ్చే ప్రోత్సాహకాలు గరిష్ఠ పరిమితి రూ.200 కోట్లు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి రాయితీలనే కోరుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక పథకాన్ని అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఈ తరహా రాయితీలు కల్పించడంతో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొస్తాయని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ‘‘ఇప్పుడు ఎవ్వరికీ హోదా లేదు. అన్ని రాష్ట్రాలూ సమానమే’’ అంటూ నవ్యాంధ్రకు మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకు మా రాష్ట్రానికి అన్యాయం చేసింది అని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, పవన్ కాని, జగన్ కాని, ఈ విషయం పై కనీసం మాట్లాడరు...