సమాజం లోని అన్ని వర్గాల ఆర్ధిక అభివృద్దికి కృషి చేయాలని, అందుకోసం అగ్రవర్ణ పేదలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో S.C , S.T. , B.C. , మైనారిటీ వర్గాలకు అనేక ప్రభుత్వ పధకాలు ఆయా కార్పొరేషన్ ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలు గా అభివృద్దికి నోచుకోని వర్గాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనే నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు, వీటిని అమలుపరిచి, ఆ వర్గాలకు అండగా నిలిచాయి. చంద్రబాబు ప్రభుత్వం కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ లు కూడా ఏర్పాటు చేసారు...
మిగతా కులాలలో ( రెడ్డి , కమ్మ , వైశ్య , వెలమ , క్షత్రియ ) కూడా పేదలు ఉన్నారు. ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకోవటం లేదన్న భావన వీరిలో రోజు రోజుకీ బలపడుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ తరుణంలో, బలహీన వర్గాల తరహా లోనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకూ కార్పొరేషన్ అమలు చేసి అగ్రవర్ణ పేదలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు... పోయిన ఏడాది ఈబీసీ కార్పొరేషన్ ద్వారా వారిని ఆడుకున్నారు... ఈ సంవత్సరం కూడా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల్లో పేదలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సంక ల్పించింది. ఒక్కో యూనిట్ కు రూ.2 లక్షలు ఇవ్వనుండగా, అందులో రూ. లక్ష రాయితీ, రూ. లక్ష బ్యాంకు రుణం ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ, బీసీ, ఎం. బి.సి, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలకు చెందిన వారు మినహా, ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకడిన వారు ఈ నెల 31వ తేదీ లోపు http://apobmms.cgg.gov.in అనే వెబ్సైటులో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు, మీ సేవా కేంద్రం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది... ఈ పథకానికి 21 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు వీటికి అర్హులు... రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫొటోతో మీ-సేవా, ఇంటర్నెట్, ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో, లేకపోతే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి... http://apobmms.cgg.gov.in...