రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కోడలి నాని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం, కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. కొడాలి నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, నేరపూరిత బెదిరింపులు వంటి సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేయాలని, ఐపీసిలోని 504, 505, 506, మొత్తం ఈ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఎన్నికల కమిషన్ గురించి దురుద్దేశాలు ఆపాదించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు, మోరల్ కోడ్ అఫ్ కాండక్ట్ లోని, ఎన్నికల్ ప్రవర్తనా నియమావళి క్లాజ్ 1 అండ్ 4, ఈ సెక్షన్ ల కింద కూడా కేసు నమోదు చేయాలని, ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఉదయం కొడాలి నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో, మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో ఎన్నికల కమిషన్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని, దీని పై వెంటనే తగు వివరణ ఇవ్వాలని, వెంటనే ఎన్నికల కమిషన్, కొడాలి నానికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీస్ కు సమాధానంగా నిన్న సాయంత్రం, మూడు గంటలకు, ఆయన న్యాయవాది చిరంజీవి ద్వారా, రిప్లై పంపారు. తనకు ఎన్నికల కమిషన్ ను కించపరిచే ఉద్దేశం లేదు అని చెప్పారు.

nani 13022021 2

పోలింగ్ సమయంలో, తెలుగుదేశం పార్టీ వేధింపులు గురించి మాట్లాడటానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసానని, తన వ్యాఖ్యలు తప్పుగా అర్ధం చేసుకున్నారని, తనకు రాజ్యాంగ సంస్థల పట్ల పూర్తి గౌరవం ఉందని చెప్తూ, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ను, ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నేపధ్యంలోనే, షోకాజ్ నోటీస్ లో ఇచ్చిన వివరణతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదని పేర్కొంటూ, గత రాత్రి ఆయన పై క్రమశిక్షణా చర్యలకు పూనుకుంది. ఈ నెల 21వ తేదీ వరకు కొడాలి నాని, మీడియాతో మాట్లాడకూడదు అని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు అని, ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా ఆయన బహిరంగ సభలు, గ్రూపు సమావేశాలలో కూడా మాట్లాడటానికి వీలు లేదని స్పష్టం చేసింది. అయితే దీని పై కొడాలి నాని, ఈ రోజు హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని అనుకుంటూ ఉండగానే, ఇప్పుడు ఎన్నికల కమిషన్, కొడాలి నాని పై కేసు నమోదు చేయాలని చెప్పటం సంచలనంగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read