గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నిందలు వేస్తూ, హడావిడి చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, జగన్ లకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన ఎలక్షన్ కమిషన్.. మొన్న హైకోర్ట్ ఎలా అయితే తెలంగాణా పోలీసులని తిట్టిందో, ఇది అంతకు మించి ఎదురు దెబ్బ. ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలుగుదేశం పార్టీ ఐటి సర్వీసెస్ మాత్రమే చేస్తుంది అని చెప్పినా వినకుండా, ఆ డేటా మొత్తం నొక్కేసి, వైసీపీకి ఇచ్చే ప్లాన్ వేసారు. అయితే దీని కోసం, ఓటర్ లిస్టు అంతా, ఈ కంపెనీ దొంగతనం చేసింది అని, బయటకు రాని డేటా కూడా వీళ్ళ దగ్గర ఉంది అంటూ హడావిడి చేసారు. అయితే అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఉండే ఓటర్ జాబితా, ఆన్లైన్ లో ఉండే ఓటర్ జాబితా మాత్రమే, ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద ఉంది అని చెప్పినా, జగన్ తో, కలిసి ఏపి ప్రభుత్వం పై కేసీఆర్ కుట్ర పన్నారు.
అయితే వీళ్ళకు చెంప పెట్టు అన్నట్టు, ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభ్యమైన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జి.కె. ద్వివేది స్పష్టంచేశారు. పబ్లిక్ డొమైన్‌లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకొనే వీలుందని చెప్పారు. డేటా వివాదంపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదన్నారు. ఎన్నికల ఉద్యోగులు తప్పుచేసినా క్రిమినల్ చర్యలతో పాటు సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఓటరు జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతా లింకు సమాచారం ఉండదని, ఇతర సంక్షేమ పథకాల సమాచారం కూడా ఏదీ ఉండదని ద్వివేది స్పష్టంచేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఓటర్ల జాబితా ఎక్కడ నుంచి వచ్చిందో తెలంగాణ కమిషనర్ సజ్జనార్ చెప్పాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 45వేల మంది బూత్ లెవెల్ అధికారులు ఉండగా.. వారిలో ఎవరోఒకరు పొరపాటు చేసే అవకాశం ఉందన్నారు. ఓట్లు తొలగించాలంటూ వారం రోజుల క్రితం వరకు రోజుకు లక్ష దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు గణనీయంగా తగ్గాయని ద్వివేది తెలిపారు. ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. కేసులు నమోదు కావడంతో ఫారం 7 దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు కోసం మోసం చేస్తే ఈసీ చూస్తూ ఊరుకోదన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని, ఎన్నికల సంఘానికి దురుద్దేశాలు అపాదించడం సరికాదని ద్వివేది వ్యాఖ్యానించారు.