దేశంతో పాటు, రాష్ట్రంలో కూడా, రాష్ట్రంలో కరోనా మహమ్మరి విస్తరిస్తున్న పరిస్థితి. శనివారం మూడు కేసులు ఉన్న ఏపిలో, ఈ రోజు ఆరు కేసులు వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు లాగే, . ఈ నెల 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశాలు ఇచ్చింది. ప్రజా రవాణా ఆగిపోయింది. నిత్యావసరం కాని దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, గోదాములు వంటివి అవసరమైతే.. పరిమిత సిబ్బందితో పనిచేయాలని సూచించారు. మందిరాలు, మసీదులు, చర్చిల్లోనూ 31వ తేదీ వరకు దర్శనాలు, ప్రార్థనలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రజలు కొన్ని రోజుల పాటు ఇళ్లలోనే ఉండటం ద్వారానే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పది మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్లు, జేసీలు,ఆర్డీవోలు,ఎమ్మార్వోలు, వైద్యఆరోగ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్‌ శాఖ, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకులు, ఏటీఎంలు, ఫార్మసీ దుకాణాలు, మీడియా సిబ్బందికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర విధులు నిర్వహించేవారు మాత్రమే హాజరవ్వాలని సూచించారు. తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించాల్సిన పరిశ్రమలు.. ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. వ్యవసాయ పనులపై ఉన్న రైతులు, కూలీలకు మినహాయింపునిచ్చారు. లాక్ డౌన్ ఆదేశాలు, ఎవరైనా ఉల్లంఘిస్తే, అలాంటి వారిపై ఐపీసీ 188 ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

అయితే సరిగ్గా వారం క్రిండటం, పరిస్థితి వేరు. అన్నీ అనుకునట్టు జరిగితే, ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగేవి. కాని, ముందు చూపుతో, కరోనా విస్తరిస్తుంది అని తెలుసుకుని, కేంద్రం సూచనలతో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్, ఎన్నికలు వాయిదా వేసారు. అయితే జగన్, ఆయన మంత్రులు, రమేష్ కుమార్ కు కులం ఆపాదించింది, ఎన్నికలు జరగాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. అయితే సుప్రీం కోర్ట్ లో కొట్టేసారు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందొ చూస్తున్నాం. మొత్తం దేశం లాక్ డౌన్ అయ్యింది. మూర్ఖంగా, ఈ రోజు ఎన్నికలకు వెళ్లి ఉంటే ? ఎంతటి విధ్వంసం జరిగేది ? ఆయన కనుక వాయిదా వేయకపోతే, తెలుగు నెల ఇంకో ఇటలీ అయియ్యేది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం సరిగ్గా స్పందించటం లేదు అనే వాదన ఉంది, ఒక వేళ ఎన్నికలు జరిగి ఉంటే ? దేశం కాదు, ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా జగన్ పై విమర్శలు చేసావారు. ప్రజలు కూడా సహకారం ఇచ్చే వారు కాదు. ఇవన్నీ చూస్తుంటే, రమేష్ కుమార్ గారు ఎన్నికలు వాయిదా వేసి, జగన్ మోహన్ రెడ్డికి ఎంతో మంచి చేసారని, విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన్ను తిట్టకుండా, ఈ రోజు ఏమి జరగనందుకు, థాంక్స్ చెప్పాలని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read