ఏపీలో ఎన్నికలు జరిగి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరుతొ రాష్ట్రానికి సంబందించిన ఎలాంటి పనులను చేయనివ్వడంలేదని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో మంత్రులు ఎలాంటి సమీక్షలు చేయొద్దు అని చెప్పలేదని, ఎన్నికల సంఘం అధికారి ద్వివేది వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి నిర్వహించే సమీక్షలకు వెళ్లాలని అధికారులు అందరు కూడా నిర్ణయించుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించి.. ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల్లో... ఎన్నికల కోడ్ను మినహాయించింది. ఫణి తుపాను నేపథ్యంలో విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సహాయ చర్యలకు విఘాతం కలగకుండా... కోడ్ మినహాయించాలని ఈసీకు చంద్రబాబు లేఖ రాశారు. ఆయన లేఖకు సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ మేరకు నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ను మినహాయించింది. దీనిపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కాగా నిన్న చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలించాలని ఈసీకి లేఖ రాస్తే ఇంత వరకు స్పందన లేదన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు అత్యవసర సందర్భాల్లోనైనా వారు స్పందించాలని కోరారు. వ్యవస్థల మధ్య ఘర్షణ వైఖరి రాకూడదన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నానని తెలిపారు. ఈసీ ఇప్పటికే మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. అధికారులు ఒక బృందంగా ఉంటూ సమర్ధంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అయితే ఇప్పుడు తాజగా ఉత్తర్వులతో, వివాదం ముగిసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికార పార్టీ మంత్రులకి ఎలాంటి అధికారాలు లేవని వాదిస్తూ వచినటువంటి ఎన్నికల అధికారులతో ఒకరకమైన తిరుగుబాటు చేసి సీఈవో, సీఎస్ లను ప్రశ్నించడం ప్రారంభించారు. దెబ్బకి దిగి వచ్చిన ఈసీ కూడా తాము సమీక్షలు చేయవద్దని చెప్పలేదని అధికారులకు క్లారిటీ ఇచ్చింది.