ఎన్నికల కమిషన్కు ఘాటుగా సమాధానం ఇచ్చిన శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం గారు నిజాయితీపరుడు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి.. చెంప చెళ్ళుమనేలాంటి జవాబిచ్చిన శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం. సీఈఓ ద్వివేది కి లేఖ. విజయ సాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సాక్ష్యాలతో సహా నిరూపించిన ఎస్ పి. తనపై తప్పుడు ఆరోపణలు చేరిన విజయసాయి రెడ్డి బృందంపై 182 ఐపీసీ కింద కేసు వేయనున్న ఎస్ పి. విజయసాయి రెడ్డి కి శిక్ష తప్పని పరిస్థితి. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలి లేదా ఆరోపణలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎస్ పి డిమాండ్. ఎంత స్పీడ్ గా విజయ సాయి రెడ్డి ఆరోపణల ఆధారంగా తనపై బదిలీ వేటు వేసారో అంతే స్పీడ్ గా తాను దోషో నిర్దోషో తేల్చాలన్న ఎస్ పి.
ఇంతే కాక పరువు నష్టం దావా కూడా వేయనున్న ఎస్ పి. SI స్థాయి నుంచి ముప్పై ఏళ్ళ కష్టంతో ఈ స్థాయిని వచ్చాను. తప్పుడు ఆరోపణలతో నా ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీశారు. కుటుంబం, మిత్రులు, బంధువులు, సమాజం తాను వ్యక్తిత్వాన్ని అనుమానించే పరిస్థితి వచ్చిందన్న ఎస్ పి. నిజమేమిటో తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అన్న ఎస్ పి. ఇదే బాటలో ఇతర ఐపిఎస్ లు. విజయసాయి రెడ్డి తో పాటు ఇరుక్కున్న ఎలక్షన్ కమిషన్. పరువు నష్టం దావాలు ఎదుర్కోక తప్పని ఎలక్షన్ కమిషన్ సభ్యులు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం, ఏ శిక్షణ అయినా వేసుకోండి అంటూ ఈసీకి లేఖ.. తన పై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని చెప్పిన ఎస్పీ..
రూ.50 కోట్లతో వెళ్తున్న నారయణ కాలేజీ వ్యాన్ కు ఎస్కార్ట్ ఇచ్చాను అంటూ, విజయసాయి తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ నాకు ఫోన్ చేసి, ఆ వ్యాన్ కు ఎస్కార్ట్ ఇవ్వమంటే, నేను ఇచ్చాను అంటూ చెప్పటం నిరాధారం అని అనంరు. మార్చ్ 18న నేను అసలు బయట లేనని, శాఖా పరమైన సమీక్షలో ఉన్నానని అన్నారు. కావలంటే ఫోటోలు, రికార్డులు చూడాలని, అవి కూడా జతపరిచారు. తన పరువు, ప్రతిష్ట భంగం కలిగించిన, విజయసాయి రెడ్డి పై, క్రిమినల్, సివిల్ చర్యలు చేపట్టాలని, కోరినట్టు చెప్పారు. మొత్తానికి నిబద్ధత కలిగిన ఆఫీసర్ లని, దొంగలు వేలెత్తి చూపితే ఎలా ఉంటుందో, ఎస్పీ చేసి చూపించారు.