ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సీఈవో సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేయడం జరిగింది. సిసోడియా స్థానంలో సీఈవోగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పురంధేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో గోపాలకృష్ణ ద్వివేది వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కూడా ద్వివేది పనిచేశారు. కాగా 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది.. ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు.

ec 18012019

ఉత్తర్వులు అందిన అనంతరం గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహిస్తామన్నారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఛాలెంజ్‌గా తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోయేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓట్ల గల్లంతుపై ఓటర్లకు అవగాహన ఉండాలని.. తప్పకుండా ఓటర్లు వారి ఓటును పరిశీలించుకోవాలి అని ఈ సందర్భంగా సీఈవో గోపాలకృష్ణ పేర్కొన్నారు.

 

ec 18012019

అయితే ఈ మార్పులు అన్నీ చంద్రబాబు గమనిస్తున్నారు. తమ చేతిలో ఉన్న అధికారంతో మోడీ, అమిత్ షా, ఎన్ని కుట్రలు అయినా పన్నుతారని, ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలని చెప్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు కేసీఆర్ కూడా తోడు అవ్వటంతో, అక్కడ ఇంటలిజెన్స్ కూడా మనకు వ్యక్తిరేకంగా పని చేస్తుందని, జగన మోహన్ రెడ్డికి లబ్ది చేకూరేలా చేస్తారని, అప్రమత్తంగా ఉండలాని అంటున్నారు. ఇది ఒక్కటే కాదని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, ఎదో ఒక వంకతో, డీజీపీని కూడా తప్పిస్తారని, వారికి కావలసిన వారిని పెట్టుకుని, పోలీస్ వ్యవస్థని కూడా వారి కంట్రోల్ లోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదని, ఈ కుట్రలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించలాని, చంద్రబాబు పార్టీ నేతలకు చెప్తున్నారు. అయితే తెలంగాణా ఎన్నికల అధికారి పై అన్ని ఆరోపణలు వచ్చినా ఏమి చెయ్యని కేంద్రం, సమర్ధవంతంగా పని చేస్తున్న సిసోడియాను ఎందుకు తప్పించిందో అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read