గత కొద్ది రోజులుగా, ఏపి పోలీసుల పై, ముఖ్యంగా ఇంటలిజెన్స్ పై కేటీఆర్ ఓ పేలుతున్నాడు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం మర్చిపోయి, తన రాజకీయం కోసం, ఏపి పై పడి ఏడుస్తున్నాడు. చివరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై, విచారణ చేసిన ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు డబ్బులు పంచడానికి వచ్చారని స్థానికులు నిలదీశారని తెరాస నేతలు చేసిన ప్రచారం నిజం కాదన్నారు సీఈఓ రంజిత్ కుమార్. ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ పనిమీదనే ధర్మపురి వచ్చారని వారిదగ్గర డబ్బు కూడా దొరకలేదని చెప్పారు. తమ విచారణలో కూడా ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ పనిమీదే వచ్చారని ఎలాంటి కోడ్ ఉల్లంఘన జరగలేదని తేలిందని చెప్పారు.

ktr 03112018 2

ఈ ఆరోపణల పై ఏపి డీజీపీ కూడా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు మహాకూటమి తరఫున డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఏపీ డీజీపీ తోసిపుచ్చారు. ఆ ముగ్గురు తమ సిబ్బందేనని, వామపక్ష తీవ్రవాదం పై సమాచార సేకరణ కోసమే తెలంగాణకు వెళ్లారని తెలిపారు. ‘ఏపీ నిఘా పోలీసులకు తెలంగాణలో ఏం పని ఉంది’ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన విమర్శలకూ సమాధానం ఇచ్చారు. ‘ఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీ-సీఈవో రజత్‌ కుమార్‌ షైనీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి సమాచారం తెప్పించుకుని తెలంగాణ సీఈవోకు డీజీపీ సమాధానం పంపించారు.

ktr 03112018 3

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఏపీకి చెందిన కీలకమైన ఆస్తులు, వీఐపీల రక్షణకు పలు విభాగాలు పని చేస్తున్నాయి. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాలపై రహస్య సమాచారం తెలుసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మా విభాగాలు విధులు నిర్వహిస్తున్నాయి. అంతర్గత భద్రతపై వివరాలు సేకరించేందుకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది’’ అని డీజీపీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచారనడం అసత్యం, నిరాధారమని తెలిపారు. స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపి... ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించారన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read