టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌‌గా తీసుకుంది. శనివారం రాత్రి కొడంగల్‌ నియోజకవర్గంలో పోలీసులతో అర్దారాత్రి దాడులు చేపించిన నేపధ్యంలో రేవంత్ ధర్నా చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చేస్తున్న పనుల పై దుమ్మెత్తి పోస్టు, ఈ నెల 4న కొడంగల్ బంద్ కు పిలుపిచ్చారు. అయితే, మరుసటి రోజు దాన్ని ఉపసమహరించుకున్నారు కూడా. అయితే, శనివారం భయాందోళనలు సృష్టించిన రేవంత్‌రెడ్డి.ని, ఈ నెల 4న సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకోవడంతో పాటు బంద్‌కు పిలుపునిచ్చి ఆందోళనకు గురిచేశారని ఎన్నికల కమిషన్‌‌కు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. రేవంత్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ఆదేశాలు జారీచేశారు.

revanth 03122018

రేవంత్‌రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఈసీ ఆదేశించింది. రేవంత్‌పై ఏం చర్యలు తీసుకున్నారో సోమవారంలోగా వివరణ ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు. అయితే అదే సందర్భంలో, తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేసిన సమయంలో ఎన్నికల ఖర్చుల వివరాలు, డైరీ లభించాయని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. మండలాల వారీగా నేతల కొనుగోళ్లు, పెట్టిన ఖర్చులు, మద్యం కొనుగోలుకు చేయాల్సిన అంచనాలు తదితర వివరాలతోపాటు రూ. 17.51 కోట్ల నగదు దొరికిందన్నారు. ఇప్పటి వరకు ఆయన సుమారు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఐటీ అధికారులే రూ. 5 కోట్లకు ఖర్చు తేల్చారని, దీని ఆధారంగా పట్నం నరేందర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల అధికారులను కోరారు. కాని ఆ విషయం పై ఎటూ తెల్చిని ఈసీ, తన పై దాడులు జరుగుతున్నాయని, కేసీఆర్ పై విమర్శలు చేసినందుకు మాత్రం, వెంటనే రేవంత్ పై చర్యలు తీసుకోమనటం గమనార్హం..

 

revanth 03122018

అయితే రేపు కేసీఆర్ సభ, అదేరోజున నిరసన ర్యాలీలకు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రకటన.. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సోమ, మంగళవారాల్లో కొడంగల్‌లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నేనొక్కడినే.. కేసీఆర్‌కి మందీ మార్బలం, అధికారం, కమీషన్లు ఇచ్చే గుత్తేదారులు ఉన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్‌ ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కౌరవ సైన్యానికి మధ్య జరుగుతున్నాయి. ఒక్కరు కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా పాతాళానికి తొక్కుతా’నంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కోపంతో కొడంగల్‌కు తీరని అన్యాయం చేసిన కేసీఆర్‌ ముందుగా ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల మెడలు వంచి తాను తెచ్చుకున్న నారాయణ్‌పేట్‌ ఎత్తిపోతల వంటి అనేక పథకాలు అమలు కాకుండా అడ్డుపడ్డారని.. చివరకు విద్యాసంస్థలను కూడా ఏర్పాటుకానివ్వలేదని ఆరోపించారు. కోయిల్‌సాగర్‌ తాగునీటి పథకానికి రూ. 100 కోట్లు ఖర్చు చేసిన తర్వాత దాన్ని ప్రజలకు దూరం చేసిన దుర్మార్గులని రేవంత్ ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read