ఏపీ రాజకీయాలుసంచలనంగా మారాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీ పైనా కంప్లయింట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం దానిపై విచారణ జరిపింది. డీజీపీ ట్రాక్ రికార్డ్ బాగుందని.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏపీ డీజీపీ వాహనాన్నే తనిఖీ చేయడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎస్ కోట మండలం బొడ్డవరం జంక్షన్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. అదే మార్గంలో అరకు వెళ్తున్న ఏపీ డీజీపీ వాహనాన్ని ఆపారు. ఆయన వెహికల్ ను కూడా తనిఖీ చేశారు. దీంతో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్.. ఏపీ డీజీపీకే షాక్ ఇచ్చినట్లయింది. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది.

dgp 02042019

అయితే ఇదంతా విజయసాయి రెడ్డి స్కెచ్ గా తెలుస్తుంది. అధికారుల పై ఒత్తిడి తేవటానికి, ప్లాన్ గా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ వాహనంలో, తెదేపా సొమ్ములు తరలిస్తోందని వైకాపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్లు సుశీల్‌ చంద్ర, అశోక్‌ లావాసాలతో భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

dgp 02042019

గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని అందుకే మరోసారి ఫిర్యాదు చేయటానికి వచ్చామన్నారు. డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌, ప్రకాశం, గుంటూరు రూరల్‌, చిత్తూరు ఎస్పీలు, అధికారులు దామోదర్‌నాయుడు, యోగానంద్‌, ఘట్టమనేని శ్రీనివాస్‌లను బదిలీ చేయాలని కోరినా ఈసీ చర్యలు తీసుకోలేదని, దీనిపై మరోసారి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. వైకాపా అభ్యర్థుల పేర్లు పోలిన వారిని 35 అసెంబ్లీ స్థానాల్లోనూ, 4 లోక్‌సభ స్థానాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటికి నిలపడం వెనక తెదేపా హస్తం ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబుతో లాలూచి పడి కేఏపాల్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read