దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. 2019 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా గతంలో నేరాలకు పాల్పడి ఉన్నా, కేసులు నమోదై ఉన్నా చెప్పి తీరాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సోమవారం నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2014 ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలకు భిన్నంగా 2019 నామినేషన్‌ పత్రాల్లో ఈసీ కొన్ని కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. 2014లో అభ్యర్థులు తమ నేర చరిత్రను నామినేషన్‌ వేసే సమయంలో ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అసవరం లేదు.

108 26112018 1

కానీ, ఈసారి ప్రతి అభ్యర్థి తనకు నేర చరిత్ర ఉంటే ఉందని, లేదంటే లేదని పేర్కొంటూ ఒక అఫిడవిట్‌ను నామినేషన్‌తో పాటే రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. పత్రికలు, చానళ్లలో అభ్యర్థితో పాటు ఆయనకు సంబంధించిన పార్టీ ఆ అభ్యర్థికి ఉన్న క్రిమినల్‌ చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలి. గత, ప్రస్తుత క్రిమినల్‌ కేసులను స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తమ నేర చరిత్రను దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. దేశపౌరులెవరైనా ఆ అభ్యర్థిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, వార్తా చానళ్లల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనలు వెలువడే అవకాశాలున్నా యి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనలకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించనుంది.

108 26112018 1

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నేర చరిత్ర ప్రజల్లో చర్చకు దారితీయనుంది. ఓటెయ్యడానికి ముందే ప్రజలు తమ నేర చరిత్రను తెలుసుకోనుండడంతో.. నేరచరిత గల అభ్యర్థులకు ఎన్నికల ఫలితాలపై ఆందోళన తప్పేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. ఆ విషయాన్ని అభ్యర్థితో పాటు, ఆ అభ్యర్థికి చెందిన రాజకీయ పార్టీ బహిర్గతం చేయాల్సిందేనని గత సెప్టెంబర్‌ 25న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇకపై పార్లమెంట్‌ ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే నేర చరిత్ర గల అభ్యర్థులతో పాటు అలాంటి అభ్యర్థులను నిలబెట్టే రాజకీయ పార్టీలు నిర్దేశించిన ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత అక్టోబర్‌ 10న ఆదేశాలు జారీ చేసింది. అయితే, నేర చరిత్రపై పత్రికలు, వార్తా చానళ్లలో జారీ చేసే ప్రకటనల ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద జమ చేయరాదని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు ఈ వార్తా మన రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. జగన్ లాగా 11 కేసుల్లో A1 గా ఉన్నవారి పరిస్థితి అయితే మరీ ఘోరం. అయితే జగన్ వర్గం మాత్రం, మావాడిది నేర చరిత్ర కాదు, ఆర్ధిక నేరం అందుకే మేము ఇలాంటివి చేయనవసరం లేదు అంటున్నారు. మరి ఈసీ ఏమంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read