ఎలక్షన్ కమిషన్ నిర్వాకంతో, ఎంతో మంది ఓట్లు పోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో దాదపుగా 25 లక్షల ఓట్లు లేగిసాయి. ఆంధ్రపదేశ్ ల కూడా 8 లక్షల ఓట్లు లేపెయటానికి చూస్తే, చంద్రబాబు అడ్డుకోవటంతో, ఆ ప్లాన్ అడ్డం తిరిగింది. అయితే, ఇప్పుడు ఏకంగా, మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. నిన్న కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ద్రవిడ్, ఆయన సతీమణి విజేత ఓటు వేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే వీరిద్దరి పేర్లు ఓటరు లిస్టులో లేవు. రాహుల్ ద్రవిడ్ కర్ణాటక ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.

dravid 19042019 1

ప్రస్తుతం కర్ణాటకలో ‘మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి’ అనే నినాదంతో ద్రవిడ్ ఫొటోతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఓటర్లలో చైతన్యం నింపడానికి ముందుకొచ్చిన ద్రవిడ్‌కే ఓటు హక్కు లేకపోవడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనకున్న కారణం గురించి సదరు ఎన్నికల అధికారి వెల్లడించారు. కిందటేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ద్రవిడ్‌ను ఈసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అప్పట్లో ద్రవిడ్ కుటుంబం సెంట్రల్ బెంగళూరులోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేది. తన తండ్రి మరణానంతరం ద్రవిడ్ ఇందిరానగర్ నుంచి బెంగళూరు నార్త్‌లోని అశ్వంత్‌నగర్‌కు మకాం మార్చారు.

dravid 19042019 1

దీంతో ఇందిరానగర్‌ ఓటరు జాబితా నుంచి ద్రవిడ్, ఆయన భార్య పేర్లను తొలగించారు. అయితే, అశ్వంత్‌నగర్‌కు వెళ్లిన తరవాత ద్రవిడ్ ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 16 వరకు జరిగిన ఓటరు నమోదు కార్యక్రమంలో ద్రవిడ్ ఫాం 6ను అధికారులకు సమర్పించలేదు. దీంతో ద్రవిడ్, ఆయన భార్య విజేత పేర్లను ఓటరు జాబితాలో చేర్చలేదు. అయితే ప్రస్తుతం ద్రవిడ్ బెంగళూరులో లేరని, స్పెయిన్‌లో ఉన్నారని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఏదేమైనా ఏకంగా బ్రాండ్ అంబాసిడర్‌ కే ఓటు లేకుండా, అతని చేతే ప్రచారం చేపిస్తున్న ఎలక్షన్ కమిషన్ వైఖరి పై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read