రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిన్న హైకోర్టులో, ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వటం లేదు అంటూ వేసిన పిటీషన్ పై, ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా, ఈ పిటీషన్ విచారణకు రావటానికి ముందే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు రూ.39 లక్షల రూపాయాల నిధులు బదిలీ చేసింది. అయితే ఈ పిటీషన్ వేయటంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యి, నిధులు విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో, ఈ పిటీషన్ విచారణకు రావటంతో, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నాం అంటూ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటుగా, రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న ఎన్నికల కమిషన్, నిధులు కోసం, హైకోర్టుకు రావటం బాధాకరం అని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అంటూ, రాష్ట్ర ప్రభుత్వ తరుపున న్యాయవాది చెప్పారు. అయితే ఇదే సమయంలో హైకోర్టు మేము, ఈ విషయాలు అన్నీ గమనిస్తున్నామని, ఈ విషయాలు గమనిస్తే తప్పు ఏంటి అంటూ, హైకోర్టు ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణకు, కావాల్సిన సిబ్బందిని కూడా అందించాలని ఎన్నికల కమిషన్ పిటీషన్ లో తెలిపింది. దీనికి సంబంధించి కూడా, రేపు హైకోర్టులో పూర్తీ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలనీ ఆదేశించింది. అఫిడవిట్ పరిశీలించిన తరువాత, అది పరిశీలించి తాము ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపధ్యంలోనే ఎన్నికల కమిషన్ పిటీషన్ వేయటం, వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయటం జరిగిపోయింది. మిగతా ఎన్నికల ప్రక్రియకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమి ఆవసరం, ఏమి సహకారం కావలి అంటూ, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే రేపు ఎన్నికల కమిషన్ ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేస్తే, ఆ తరువాత హైకోర్టు పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చే అవకాసం కనిపిస్తుంది. అయితే నిన్న ఈ విషయం పై నిమ్మగడ్డ పిటీషన్ దాఖలు చేసారు. ఆర్టికల్243(కే) ప్రకారం, ఎలక్షన్ కమిషన్ నిధులు ఆపేయటం, రాజ్యాంగ విరుద్ధం అని తన పిటీషన్ లో తెలిపారు. ప్రభుత్వం తమకు సహకరించటం లేదు కాబట్టి, కోర్టు జోక్యం చేసుకోవాలని, ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ పరిణామం పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని, ఈ దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి జరిగి ఉండదని, వ్యవస్థలతో , కావాలని ఇలా డీ కట్టటం ఏమిటి అంటూ, ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read