జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఈడీ. ఆయన పై, ఇపుడు మరో ఈడీ కేసులో విచారణ మొదలైంది. ఇప్పటికే జగన్ పైన 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ మరో చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాల పై, గతంలోనే ఈడీ అభియోగాలు మోపి, చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే అందులో తప్పులు ఉన్నాయని, ఈడీ కోర్టు దాన్ని తప్పి పంపించింది. ఆ చార్జ్ షీట్ ని మళ్ళీ సవరించిన ఈడీ, సరైన విధంగా చార్జ్ షీట్ దాఖలు చేసింది. మొన్న మార్చి నెలలో ఈడీ మళ్ళీ చార్జ్ షీట్ వేయగా, దాన్ని గత నెల 23న ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ చార్జ్ షీట్ లో హేమా హేమీలను, ఈడీ కోర్టు పేర్కొంది. అందులో జగన్ ఏ1 కాగా, మిగతా వారి పేర్లు ఇలా ఉన్నాయి. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, అలాగే వైసిపీ ఎమ్మెల్యే వీవీ కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి సహా ఆనేక మందికి ఈడీ నిందితులుగా తమ చార్జ్ షీట్ లో పెట్టింది. ఇది ఇలా ఉంటే, ఇక్కడ ఒక అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. జగన్ అన్ని కేసుల్లో, ఆయన ఏ1 గా ఉంటే, విజయసాయి రెడ్డి ఏ2 గా ఉంటూ వచ్చారు. అయితే ఈ కేసులో మాత్రం, అందుకు భిన్నంగా జరిగింది.

jagan 30052021 2

ఈ కేసు నుంచి, విజయసాయి రెడ్డిని ఈడీ తప్పించటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అలాగే జగన్‌కు సంబంధించిన కార్మెల్ ఏషియా కంపెనీతో పాటుగా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేరు కూడా ఇందులో పెట్టలేదు. ఈ కేసుకు సంబంధించి, సిబిఐ 14 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే ఈడీ మాత్రం, కేవలం 11 మందిని మాత్రమే నిందితులుగా చేర్చింది. ఇందులో విజయసాయి రెడ్డి లేకపోవటం విశేషం. ఈ కేసుకు సంబంధించి, ఇప్పటికే కొన్ని ఆస్తులు ఆటాచ్ చేసారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీని, గృహనిర్మాణ శాఖకు సంబందించిన, కొన్ని భూములు, అతి తక్కువ ధరకే ఇచ్చారని, దానికి క్విడ్ ప్రోకో గా, జగన్ కంపెనీలలో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి వాటాలు కొనుగోలు చేసారు అనేది ఆరోపణ. అయితే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ కలిపి, గచ్చిబౌలి ఉన్న ప్రాజెక్టులో నాలుగున్నర ఎకరాల వాటాను, ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్లు, సిబిఐ తాను తయారు చేసిన చార్జ్ షీట్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల్లో బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు వస్తున్న తరుణంలో, ఇది ఆసక్తి రేపుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read