జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, రోజు వారీ విచారణ మొదలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టులో రోజు వారీ విచారణ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు, కేసుల పై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఆ పిటీషన్లలో తమ పేరు తీసేయాలని, డిశ్చార్జ్ పిటీషన్లు వేసారు. అలాగే సిబిఐ, ఈడీ కేసులు కలిసి విచారణ జరపాలి అని కూడా పిటీషన్ లు వేసారు. గత రెండు వారాలుగా వీటి పైనే విచారణ జరుగుతుంది. జగన్ తరుపున పిటీషన్ వేసిన న్యాయవాదులు, సిబిఐ , ఈడీ పెట్టిన కేసులు రెండూ ఒకటే అని, సిబిఐ కేసులు విడిగా, ఈడీ కేసులు విడిగా విచారణ చెయ్యాల్సిన అవసరం లేదు అంటూ, ఒక పిటీషన్ దాఖలు చేసారు. దీని పై జగన్ తరుపు న్యాయవాదులు వదనాలు వినిపించారు. ఇక మరో పక్క ఈడీ తరుపున కూడా కోర్టుకు వాదనలు వినిపిస్తూ, జగన్ విజ్ఞప్తిని తోసి పుచ్చారు. సిబిఐ అభియోగాలతోనే తాము ఈడీ కేసు పెట్టినా, తాము పెట్టిన కేసు వేరని చెప్పారు. సిబిఐ కేసులు వేరే సెక్షన్ తో, ఈడీ కేసులు వేరే సెక్షన్ తో నమోదు అయ్యాయని, ఇది ప్రత్యేక చట్టం కింద నమోదు చేసామని కోర్టుకు తెలిపారు. అందుకే సిబిఐ కేసులను విడిగా, ఈడీ కేసులను విడిగా విచారణ జరపాలని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. అయితే మనీలాండరింగ్‌ నిరోధక ఆక్ట్ , సెక్షన్ 44 ప్రకారం, సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ ఒకే కోర్టులో విచారణ జరపాలని ఉందని కోర్టుకు తెలిపారు.

cbi 08112020 2

అయితే దీని పై వాదనలు కొనసాగిస్తామని, తమకు మరింత సమయం కావాలని కోరటంతో, కోర్టు ఈ కేసుని సోమవారానికి వాయిదా వేసింది. ఇక అలాగే జగన్ మోహన్ రెడ్డి పేరు, ఈ కేసుల నుంచి తీసి వేయాలని కోరుతూ, వేసిన డిశ్చార్జ్ పిటీషన్ల పై కూడా వాదనలు జరిగాయి. జగన్ మోహన్ రెడ్డి ఈ నేరం చేసారు అని చెప్పటానికి, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సిబిఐ ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కేసు నుంచి జగన్ పేరు తప్పించాలని కోరారు. సిబిఐ ఇప్పటికే ఎంతో లోతైన విచారణ జరిపిందని, అయినా ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు కు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి నేరం చేసినట్టు, ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదు కదా అని ప్రశ్నించారు. కంపెనీ చట్టాల పై అవగాహన లేక, ఈ కేసులు పెట్టారని కోర్టుకు వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటీషన్ పై ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం పై, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు వినిపించారు. అయితే దీని పై ఇంకా వాదనలు కొనాగుతున్నాయి. ఇంకా సిబిఐ తరుపు వాదనలు ఈ పిటీషన్ లో జరగలేదు. ఈ కేసు కూడా సోమవారం నుంచి, మళ్ళీ వాదనలు ప్రారంభం అవుతాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read