ఈ దేశంలో ఎవరు ప్రశ్నిస్తే వారి పై ఐటి దాడులు జరుగుతున్న సీజన్ ఇది. రాజకీయ నాయకులే కాదు, ఇప్పుడు మీడియా సంస్థల పై కూడా ఐటి పంజా విసిరింది. మొన్న, మీడియా టైకూన్‌, క్వింట్‌ న్యూస్‌ పోర్టల్‌, నెట్‌వర్క్‌18 వ్యవస్థాపకుడు రాఘవ్‌ బహ్ల్‌ పై ఐటి దాడులు చేపించిన కేంద్రం, ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ పై ఈడీ దాడులు చేపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు అందుకున్న కారణంగా చూపి ఎన్డీటీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి.. రూ.1637 కోట్లు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిందని.. అలాగే విదేశాల్లో రూ.2732 కోట్లు పెట్టుబడి పెట్టిందని నోటీసులో ఈడీ పేర్కొంది.

ed 19102018 2

ఎఫ్‌డీఐలు రూ.600 కోట్లు మించితే సీసీఈఏ అనుమతి తప్పనిసరి.. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రూ.725 కోట్లు ఎన్డీటీవీ తీసుకున్నట్టు సమాచారం. వీటితోపాటు మరికొన్ని అవకతవకలు ఉన్నట్లు గుర్తించడంతో ఫెమా కింద పలువురు వ్యక్తులతోపాటు కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. మరో పక్క, ఎన్డీటీవీ పై రిలయన్స్ గ్రూప్ యాజమాన్యం రూ.10,000 కోట్ల దావా వేసింది. రఫేల్ జెట్ ఫైటర్స్ డీల్ పై ఎన్డీటీవీ ప్రసారం చేసిన వార్తల్లో నిజం లేదని అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ వాదిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ అహ్మదాబాద్ కోర్టులో దావా వేశారు.

ed 19102018 3

తాము ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయలేదని ఎన్డీటీవీ చెబుతోంది. మీడియాను తొక్కిపెట్టేందుకే రిలయన్స్ దావా వేసిందని ఎన్డీటీవీ చెబుతోంది. ప్రజలకు ఆసక్తికర వార్తలు ఇవ్వటమే తమ విధి అంటోంది. ప్రస్తుతం రఫేల్ డీల్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే... ఇది కేవలం తమపైనే కాదు మొత్తం మీడియాను భయపెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ ఈ విధంగా చేస్తోందని ఎన్డీటీవీ పేర్కొంది. నిజాలు నిర్భయంగా చెప్పటానికి తాము భయపడమని వ్యాఖ్యానించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read